పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలు

August 22, 2019

warts removal tips remedies in telugu

  1. పుపిరులపైన ఆముదం రాసి స్టిక్కింగ్ టేప్ అంటించడం వల్ల కొద్ది రోజులకు పులిపిరులూ రాలిపోతాయి. లేదా తరుచు ఆముదం రాస్తూ ఉంటె కొద్దిరోజులకు అవే రాలిపోతాయి.
  2. వెల్లుల్లి గుజ్జుని తరుచు పులిపిరులపైనా రాస్తూ ఉంటే కొద్దిరోజులకే రాలిపోతాయి.
  3. కొత్త సున్నం తీసుకుని పులిపిరులపైనా రాసి తరువాత అల్లం ముక్కను వాడిగా చెక్కి సున్నం లో ముంచి పులిపిరులపైనా రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఫలితం వెంటనే ఉంటుంది. కానీ పక్కన చర్మానికి అంటకుండా చూడాలి. ఎందుకంటె సున్నం అంటితే బొబ్బలు వస్తాయి.
  4. ఉల్లి రసంలో ఉప్పు కలిపి పులిపిరుల పైనా రాస్తూ ఉంటె కొద్దిరోజులకే రాలిపోతాయి.
  5. బంగాళాదుంపను ముక్కలుగా చేసి పులిపిరులపైనా రుద్దుతూ ఉంటే 15 రోజులలో రాలిపోతాయి.
  6. వాటర్ ప్రూఫ్ స్టిక్కింగ్ టేప్ పులిపిరులపైనా అంటించి 1 వరం తరువాత తీసివేసి 12 గంటల తరువాత మళ్ళీ టేప్ వేయాలి. ఇలా చేయడం వల్ల నశించిపోయి రాలిపోతాయి.