వందలకు పైగా రోగాలను నయంచేసే త్రిఫల చూర్ణం

October 20, 2019

కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ ఈ మూడు ఫలాలను ఎండబెట్టి విడివిడిగా పొడిచేసి ఒక నిర్ణీత మోతాదులో కలిపి ఈ త్రిఫల చూర్ణం తయారుచేస్తారు. ఈ త్రిఫల చూర్ణం అన్ని ఆయుర్వేదిక్ స్టోర్స్ లో రెడీమెడ్ గా దొరుకుతాయి. ఈ 3 ఫలాలు ఎండబెట్టినవి కూడా దొరుకుతాయి. ఆయుర్వేదంలో ఇది ఒక అద్భుతమైన మెడిసిన్. లెక్కలేనన్ని వ్యాధులను నయం చేయడమే కాకా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఒక గొప్ప ఔషధం. ఇది వాత, పిత్త, కఫ దోషాలను హరిస్తుంది.

triphala churna benefits in telugu

త్రిఫల చూర్ణం వలన కలిగే ప్రయోజనాలు:

  1. అజీర్ణం, తేన్పులు, మలబద్దకం, కడుపు ఉబ్బరం కి – ఇది ఒక మంచి మెడిసిన్. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ త్రిఫల చూర్ణం కలిపి తాగితే సరిపోతుంది.
  2. అధిక బరువు – 2 పూటలా ఒక స్పూన్ చూర్ణానికి తేనె కలిపి చప్పరిస్తుంటే అధిక బరువు సమస్య క్రమంగా తగ్గిపోతుంది.
  3. పైల్స్/అరిసెమొలలు – సునాముఖి చూర్ణం ఒక వంతు మరియు త్రిఫల చూర్ణం 3 వంతులు తీసుకొని వీటికి తగినంత తేనె చేర్చి ఒక గాజు పాత్రలో నిల్వ చేసుకోవాలి. రోజుకి 1 లేదా 2స్పూన్లు తీసుకుంటుంటే పైల్స్, మలబద్దకం సమస్య తగ్గిపోతుంది.
  4. నోటిలో ఫుల్లు, నోటి అల్సర్లు, చిగుళ్ల నుండి రక్తస్రావం – ఈ సమస్యలకి త్రిఫల చూర్ణం తో కాషాయం తయారుచేసి, ఈ కాషాయం తో ఈ పుల్లని క్లీన్ చేసుకోవాలి. ఈ కాషాయం తో పుక్కిలించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  5. షుగర్ – 2 పూటలా ఈ చూర్ణం ఒక స్పూన్ చొప్పున 1 గ్లాస్ నీటిలో కలిపి తీసుకుంటుంటే షుగర్ కంట్రోల్ ఉంటుంది.
  6. పిప్పి గోళ్ల సమస్య – త్రిఫల చూర్ణం, బేకింగ్ సోడా సమ పాల్లలో కలిపి తీసుకుని తగినంత నీరు చేర్చి ఈ గోళ్లపై లేపనం లాగా అప్లై చేయడం వల్ల ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది.
  7. తలలో ఫంగస్, ఫుల్లు, ఇన్ఫెక్షన్ – త్రిఫల చూర్ణం లో సరిపడా నీటిని చేర్చి పేస్ట్ ల తయారుచేసి జుట్టు కుదుళ్ళకి, జుట్టుకి బాగా అప్లై చేసి, ఆరిన తరువాత హెర్బల్ షాంపూ తో తలస్నానం చేయడం వల్ల ఈ సమస్య తగ్గిపోతుంది. అంతేకాకుండా జుట్టు అందంగా, ఆరోగ్యాంగా తయారవుతుంది.
  8. కంటి సమస్యలకి – త్రిఫల చూర్ణం తో కాషాయం తయారుచేసి, ఈ కాషాయం లో ఒక స్పూన్ నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల కంటి సమస్యలకి చెక్ పెట్టవచ్చు.
  9. నోటి దుర్వాసన, పంటి సమస్యలకి – త్రిఫల చూర్ణం తో బ్రెష్ చేయడం మంచి పరిష్కారంగా చెప్పవచ్చు.
  10. ఈ చూర్ణాన్ని తరుచు వాడుతుంటే నాడి వ్యవస్థను బలోపేతం చేస్తుంది, కాలేయ సమస్యలను అరికడుతుంది.