త్వరగా నిద్రపట్టాలంటే

July 23, 2019

  1. గోరువెచ్చని పాలలో తేనె కలుపుకొని తాగడం వల్ల బాగా నిద్రపడుతుంది.
  2. ఏదయినా జావా (రాగి, బార్లీ లాంటివి) గోరువెచ్చగా తీసుకుంటే బాగా నిద్రపడుతుంది.
  3. గోరువెచ్చని నీరు తాగినా మంచి ఫలితం ఉంటుంది.
  4. పిస్తా, పెరుగు, అరటిపండు లాంటివి తినడం వలన కూడా మంచి నిద్రపడుతుంది.
  5. అస్సలు నిద్రపట్టకపోతే అరటి పండుని తొక్కతో సహా నీటిలో ఉడికించి, ఆ నీటిలో దాల్చిన పొడి కలిపి గోరువెచ్చగా తాగితే బాగా నిద్రపడుతుంది.