బ్లాక్ హెడ్స్ నివారణ మార్గాలు

April 14, 2019

వేసవి కాలంలో ఎక్కువగా అందరిని బాధించే సమస్య బ్లాక్ హెడ్స్. వాటిని సులభంగా తొలగించుకోవడానికి నివారణ మార్గాలు.

  1. గంధపుచెక్క నుండి తీసిన గంధంలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి పేస్ ప్యాక్ వేసుకోవాలి. 20నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి.ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ పోవడమేకాక చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
  2. బేకింగ్ సోడాలో కొంచెం నీటిని కలిపి పేస్ట్ ల చేసి ఈ మిశ్రమంతో ముఖంపై స్కర్బ్ చేయాలి.10నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
  3. గుడ్డులోని తెల్లసొన తీసుకుని గిలకొట్టాలి. దీనిని బ్లాక్ హెడ్స్ ఉన్నచోట అప్లై చేయాలి. కాటన్ ను ఈ మిశ్రమంలో ముంచి బ్లాక్ఖేడ్స్ ఉన్నచోట ఉంచి అది పూర్తిగా ఆరిన తరువాత కాటన్ ను స్పీడ్ గ తీసేయాలి.
  4. దాల్చిన చెక్క పొడిలో తేనె కలిపి పేస్ట్ ల తయారుచేయాలి.ఆ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ పై రాయాలి.10మినిట్స్ తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
  5. 1 టిస్పూన్ పెరుగులో 1టి స్పూన్ బియ్యపిండిని కలిపి ఈ మిశ్రమమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్నచోట రాయాలి. ఇది ఆరిపోయిన తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా తరుచు చేస్తూ ఉంటె మంచి ఫలితం ఉంటుంది.
  6. నిమ్మరసంలో తేనె కలిపి ముఖానికి పట్టించి ఆరిన తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా రోజు మార్చి రోజు చేస్తూ ఉంటె బ్లాక్ హెడ్స్ పోవడమేకాక ముఖం కాంతివంతగా మారుతుంది.
  7. నువ్వుల నూనె ముఖం మీద రాసి తరువాత సెనగపిండిలో నీళ్లు పోసి పేస్ట్ ల చేసి దీనిని ముఖం మీద రుద్దుతూ ఆరిన తరువాత మల్లి నీళ్లు చల్లి రుద్దుతూ కడిగేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  8. కొంచం పెరుగులో ఓట్స్ కలిపి ముద్దలా చేసి ముఖానికి ప్యాక్ ల వేసి scrub చేయాలి.10 మినిట్స్ తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

గమనిక:- డ్రైస్కిన్ ఉన్నవారు ఇలాచేసిన తరువాత ముఖానికి ఏదయినా మొయిశ్చరైజర్ వాడటం మంచిది.