టేస్టీ హెల్దీ సూప్

July 26, 2019

వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలు ముక్యంగా వాతావరణంలో ని మార్పుల కారణంగా వస్తాయి. అందువల్ల యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు కలిగిన ఆహారపదార్థాలతో చేసిన వంటలు, సూప్స్ చేసుకొని తినడం వళ్ళ వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం కు మంచి మెడిసిన్ గా పనిచేస్తుంది.

సూప్ తయారీవిధానం:
అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, మిరియాలు, కొంచం బెల్లం వీటన్నింటిని సన్నగా తరిగి నీటిలో వేసి మరిగించాలి. మరిగేటపుడు కొంచెం జీలకర్ర, చిటికెడు పసుపు ఇంకా తగినంత ఉప్పు లేదా సైన్ధవ లవణం వేసి 10-15 నిమిషాలపాటు మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. వేడి వేడి టేస్టీ హెల్దీ సూప్ రెడీ. దీనిని వారానికి 2 సార్లు తీసుకుంటుంటే ఈ సీజన్లో వచ్చే సమస్యలకి చెక్ పెట్టవచ్చు.