బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు

October 25, 2019

ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మన శరీరంలో ఏమైనా మార్పులు కనిపిస్తే వెంటనే సరైన చికిత్స అనేది తప్పకుండా చేయించుకోవాలి. అయితే మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కొన్ని మార్పులను మనం గమనించవచ్చు. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

symptoms of high blood sugar levels in telugu

వినికిడి శక్తి తగ్గడం:
డయాబెటిస్ వల్ల నరాలు, బ్లడ్ వెజెల్స్ పై ప్రభావం చూపి వినికిడి లోపాలకు కారణమవుతుంది. కాబట్టి వినికిడి శక్తి కోల్పోతున్నారంటే ఒకసారి డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.

కంటిచూపు:
కొన్నిసార్లు హై బ్లడ్ షుగర్ లెవెల్స్ కారణంగా శరీరంలో ఫ్లూయిడ్ లెవెల్స్ లో తాత్కాలిక మార్పులు, కంట్లోనూ ఫ్లూయిడ్ లెవెల్స్ మార్పులు వస్తాయి.

దురద:
డయాబెటిస్ తో బాధపడేవాళ్లలో కొంతమందికి తరచుగా శరీరంపై దురద, ముఖ్యంగా పాదాలు, చేతులపై ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగక చర్మం డ్రైగా మారుతుంది. దీనివల్ల దురద సమస్య పెరుగుతుంది.

వణుకు:
శరీరంలోని కొన్ని భాగాల్లో వణుకుతున్నట్టు, తిమ్మిరి పట్టినట్టు అనిపించడం, స్పర్శ కోల్పోవడం వంటి సమస్యలు డయాబెటిస్ కి సంకేతమని గుర్తించాలి.

దుర్వాసన:
నోటిని ఎంత శుభ్రముగా ఉంచిన నోటి నుండి దుర్వాసన సమస్యను ఎదుర్కొంటున్నారని గుర్తిస్తే ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగాయనడానికి సంకేతం.

చర్మంలో మార్పులు:
బ్లడ్ లో ఇన్సులిన్ స్థాయి అస్తవ్యస్తంగా మారినప్పుడు డార్క్ స్పాట్స్ ఏర్పడతాయి. అలాగే చర్మంపై ముడతలు కనిపిస్తాయి. ఇలాంటి చర్మ సమస్యలు, లక్షణాలను గుర్తించినట్లైతే ఒకసారి డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం.

మీరు కూడా ఈ లక్షణాలలో ఏది మీకు ఉందని తెలిసిన వెంటనే టెస్ట్ చేసుకొని ఈ సమస్య నుండి బయట పడి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.