మొలకెత్తిన గింజలను ఇలా కూడా ఉపయోగించ వచ్చు

July 3, 2019

మొలకెత్తిన గింజలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికి తెలుసు. అయితే ఇవి బాగా రుచిగా లేకపోవడం లేదా ఎక్కువగా తినలేకపోవడం వంటి సమస్యలు మన డైట్ ని డిస్టర్బ్ చేస్తాయి. అయితే ఈ మొలకెత్తిన గింజల్ని నీడలో ఎండబెట్టి రవ్వలాగా, పిండి లాగా తయారుచేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. వీటితో ఉప్మా, ఇడ్లీ, దోస లాగా చేసుకోవచ్చు. వర్షాకాలంలో ఇలాంటి ఆహారం ఎంతో ఆరోగ్యకరం.