ప్రోటీన్స్ ఎక్కువగా కలిగిన ఆహార పదార్థం సోయా బీన్స్. ఎక్కువ శక్తినిచ్చే ఆహారంగా చెబుతారు. శాకాహారులకి మంచి ప్రోటీన్ ఫుడ్. 100 గ్రాముల సొయా 1కేజీ మాంసానికి సమానం. సోయా ని ఏ రకంగా తీసుకున్న ఆరోగ్యానికి చాల మంచిది. సోయా పాలు, బీన్స్, చంక్స్ ఇలా చాల రకాలుగా సోయా ని మనం తీసుకోవచ్చు. సోయా అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోకపోతే నష్టపోతారు.
పోషకాలు: వీటిలో విటమిన్ B, E ఉంటాయి. వీటితో పాటు పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
ప్రయోజనాలు:
- రక్తం లోని కొలస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచుతుంది.
- రక్తం లోని గ్లూకోస్ స్థాయిని తగ్గిస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఫుడ్.
- యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. ముడతలు, మచ్చలను తొలగిస్తుంది. చర్మపు కణాలని పునరుద్ధరిస్తుంది.
- జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తరుచు సొయా తీసుకుంటుంటే జుట్టు కాంతివంతంగా అవుతుంది, గోళ్లు పెళుసుబారే సమస్య తగ్గుతుంది.
- సొయా మోనోపాజ్ దశలో తగ్గిన లేదా ఆగిపోయిన ఈస్ట్రోజన్ ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఈ దశలో ఆడవారిలో వచ్చే గుండె, షుగర్, ఊబకాయ సమస్యలని కంట్రోల్ చేస్తుంది.
- శరీరాన్ని ప్రీ రాడికల్స్ బారినుండి రక్షిస్తాయి. హానికర టాక్సిన్స్ ను శరీరం నుండి బయటకి పంపిస్తుంది.
- ఎముకలను, దంతాలను దృడంగా చేస్తుంది.
- కీళ్ల నొప్పులు ఉన్నవారు వీటిని తరుచు తీసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది.
- జీవక్రియను వేగవంతం చేస్తుంది.
- వెజిటేరియన్స్ కి మంచి ప్రోటీన్ ఫుడ్.
గమనిక:
- ఎక్కువగా తింటే స్పెర్మ్ కౌంట్ తగ్గే ప్రమాదం ఉంది.
- 30 గ్రాములకు మించి తీసుకోకూడదు.