చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలు

November 27, 2019

చుండ్రు అనేది సాధారణంగా చలికాలంలో ఎక్కువగా బాధించే సమస్య. ఈ సమస్య వచ్చినప్పుడు జుట్టు కూడా రాలిపోతుంటుంది. మరి జుట్టు రాలిపోకుండా చుండ్రుని అరికడుతూ జుట్టు దృడంగా అవ్వాలంటే కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే సరి.

simple-and-effective-remedies-for-dandruff

  1. మెంతులను నానబెట్టి తెల్లవారు వాటిని మెత్తని పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఒక అరగంట పాటు మీ జుట్టుకి ఈ పేస్ట్ ని పట్టించి తర్వాత తేలికపాటి షాంపు / హెర్బల్ షాంపూతో కడిగేయాలి.
  2. వేప చుండ్రు చికిత్సకి మరొక సమర్థవంతమైన ములిక. నీటిని వేప ఆకులతో కాచి ఆ నీటితో జుట్టుని కడగటం వలన మంచి ఫలితం అంటుంది.
  3. త్రిఫల చూర్ణం లో నీటిని కలిప కుదుళ్ళకి, జుట్టుకి పట్టించి ఒక గంట తరువాత కడిగేయాలి. ఇలా తరుచు చేయడం వల్ల సమస్య నియంత్రణలోకి వస్తుంది.
  4. తులసి ఆకులను మరియు ఉసిరిని కలిపి పేస్ట్ లా చేయండి. ఆ ముద్దను మీ జుట్టుకి పట్టించి మృదువుగా మర్దనా చేయండి. ఒక గంట సేపు అలానే వదిలేసి ఆ తర్వాత కడిగేయండి.
  5. వెనిగర్ మరియు నిమ్మ రసం సమాన పరిమాణంలో తీసుకొని రెడింటిని కలిపి మీ జుట్టుకి మర్దనా చేయండి. కొద్దిసేపటి తరువాత హెర్బల్ షాంపూ తో శుభ్రం చేయండి.
  6. కలబంద జెల్ తో మీ జుట్టును మర్దనా చేసి, 15 నిమిషాలు అలానే వుంచి తరువాత హెర్బల్ షాంపూ తో శుభ్రం చేయాలి.