పాదాలు మృదువుగా, అందంగా అవ్వాలంటే

August 27, 2019

pedicure tips and tricks at home

  1. 2స్పూన్స్ నిమ్మరసం, 2స్పూన్స్ టమాటో రసం, 1స్పూన్స్ బేకింగ్ సోడా కలిపి పేస్ట్ ల తయారుచేయాలి. దీనిని పాదాలకు పట్టించి 15 నిమిషాల తరువాత రబ్ చేస్తూ క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి పాదాలు మృదువుగా, అందంగా తయారవుతాయి. తరువాత మొయిశ్చరైజర్ అప్లై చేయాలి.
  2. రాత్రి పడుకునే ముందు ఆముదం రాసి పొద్దున్న కడిగేయాలి. ఇలా చేయడం వల్ల రఫ్ నెస్ తగ్గి పాదాలు పగుళ్లు తగ్గిపోయి మృదువుగా తయారవుతాయి.
  3. ఆపిల్ సైడర్ వెనిగర్ 1 కప్పు, 1/2 బకెట్ నీటిలో వేసి పాదాలు అందులో ఉంచి 20 నిమిషాల తరువాత స్కర్బ్ చేస్తే మృదువైన పాదాలు పొందవచ్చు.
  4. నాచురల్ పెడిక్యూర్ – పాదాలకి ఆముదం లేదా కొబ్బరి నూనె రాసి మసాజ్ చేయాలి.తరువాత గోరువెచ్చని 1/2 బకెట్ నీటిని తీసుకుని 20 నిముషాలు పాదాలు అందులో ఉంచాలి. తరువాత బ్రష్ తో గాని లేదా రాయితో గని స్కర్బ్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి 3 టైమ్స్ చేస్తూ ఉంటే పాదాలు మృదువుగా, అందంగా తయారవుతాయి.