విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూర

February 7, 2020

మనం తినే ఆకు కూరలన్నిటిలో కాల్షియం ఎక్కువగా కలిగి ఉండే ఆకు కూర తోటకూర. అందుకే ఆకు కూరలన్నిటిలో తోటకూరని “రాణి” గ అభివర్ణిస్తారు. తోట కూర అందించే విటమిన్ లు, ఖనిజాలు, పోషక విలువల గురించి తెలిస్తే మీ రెగ్యులర్ డైట్ తప్పకుండ చేర్చుకుంటారు.

పోషకాలు : తోట కూరలో విటమిన్ A, C, D, E, K, B6, B12 లు ఉంటాయి. వీటితో పాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం, సోడియం, పొటాషియం ఉంటాయి.

ప్రయోజనాలు:

  1. రక్త హీనత సమస్యని తొలగిస్తుంది.
  2. ఎముకల దృఢత్వానికి మంచి మెడిసిన్ లాంటిది.
  3. కంటిచూపు లోపాలని సవరిస్తుంది.
  4. అధిక రక్తపోటుని అదుపులో ఉంచుతుంది.
  5. గుండె, రక్త నాళాల పనితీరుని మెరుగుపరుస్తుంది.
  6. రక్త వృద్ధి, రక్త శుద్ధి జరిగేలా చేస్తుంది.
  7. జీర్ణ సంబంధిత సమస్యలని తొలగిస్తుంది.
  8. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
  9. మొలల సమస్య తగ్గించడంలో తోడ్పడుతుంది.
  10. బరువు తగ్గడం లో ఉపకరిస్తుంది.