టమాటో వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

July 22, 2019

అతిసాధారణమైన పండు మరియు వెజిటబుల్ టమాటో. టమాటోని తేలిగ్గా చూడకండి ఇది అందించే పోషకాలు అన్ని ఇన్ని కావు. ఆపిల్ లాంటి ఫ్రూట్ కన్నా ఎక్కువ ప్రయోజనాలందిస్తుంది. టమాటో సాధారణంగా మనం వంటలలో ఎక్కువగా వాడుతుంటాం. కానీ దీని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి పూర్తిగా తెలిస్తే పచ్చిగా తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. టమాటో ని పచ్చిగా తీసుకుంటే ఇది అందించే ప్రయోజనాలని పూర్తిగా పొందవచ్చు.

పోషకాలు: టమాటో లో విటమిన్ A, B1, B3, B9, C, E, K లతో పాటు జింక్, ఐరన్, క్యాల్షియం, మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం, పాస్పరస్ ఉంటాయి. అంతేకాకుండా యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలని కలిగి ఉంటుంది.

టమాటో వలన కలిగే ప్రయోజనాలు:

  1. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చేస్తుంది.
  2. చెడు కోలాస్త్రోల్ ని తగ్గిస్తుంది, అధిక బరువు సమస్యను అరికడుతుంది.
  3. కాలేయం, మూత్రపిండాల పనితీరుని మెరుగుపరుస్తుంది.
  4. దీనిలో ఉండే విటమిన్ C చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ముడతలు రాకుండు చర్మాన్ని బిగుతుగా, కాంతివంతంగా చేస్తుంది.
  5. గుండె ఆరోగ్యాన్ని సంరక్షితుంది. గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది.
  6. శరీరంలో DNA ని డామేజ్ అవకుండా చేస్తుంది.
  7. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.
  8. ఎముకల్ని దృడంగా చేస్తుంది.
  9. కంటిచూపుని సంరక్షిస్తుంది.
  10. కేశ సౌందర్యాన్ని పెంచుతుంది.

గమనిక: టొమాటోని పచ్చిగా అది కూడా జ్యూస్ రూపంలో మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల పైన చెప్పినట్లుగా అందంగా, ఆరోగ్యాంగానే కాకుండా యవ్వనంగా కనిపిస్తారు.