కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

August 24, 2019

కాప్సికమ్ ని బెంగుళూరు మిర్చి అంటారు. సిమ్లా మిర్చి, స్వీట్ పెప్పర్, బెల్ పెప్పర్ అని కూడా అంటారు. ఇవి చాల రంగులలో దొరుకుతాయి. అమెరికాలో 900 ల సంవత్సరాలనుండి పండిస్తున్నారు. ఇవి మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా కలిగి ఉండటం మూలాన వీటిని ఎక్కువగా వాడుతున్నారు.

nutrition facts and health benefits of capsicum

పోషకాలు: విటమిన్ A, B6, C, E, K, ఫోలిక్ ఆసిడ్, ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. అంతేకాకుండా యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉంటాయి.

ప్రయోజనాలు:

  1. రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది.
  2. గొంతు బొంగురు పోవడాన్ని నివారిస్తుంది.
  3. జీవ క్రియ రేటుని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థని రెగ్యులేట్ చేస్తుంది.
  4. ఆస్తమా వంటి వ్యాదులని నివారిస్తుంది. శ్వాస వ్యవస్థకి మంచి మెడిసిన్.
  5. పెయిన్ రిలీఫ్ గా పని చేస్తుంది. ఆర్థరైటిస్ ఉన్నవారు వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది.
  6. షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  7. కాన్సర్ కారకాలని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.
  8. నాడి వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది.
  9. అధిక బరువు సమస్యని అరికడుతుంది.
  10. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది, జుట్టు ఎదుగుదలకు తోడ్పడుతుంది