ముసాంబరం తో ఆరోగ్యం

August 6, 2019

ముసాంబరం అంటే చాలామందికి తెలియదు. కలబంద మట్టల నుండి గుజ్జుని తీసి ఎండ బెడతారు. ఎండిన కలబంద గుజ్జుని ముసాంబరం అంటారు. ఇది అన్ని ఆయుర్వేదిక్ స్టోర్స్ లో దొరుకుతాయి. ఇది చూడటానికి నల్లగా ఉంటుంది. కలబంద పచ్చిగా ఉన్నపుడు కలిగిఉండే అన్ని మెడిసినల్ వాల్యూస్ ని ముసాంబరం కలిగి ఉంటుంది.

  1. ముసాంబరం పొడి, పసుపు వేడి నీళ్లలో మరిగించి బెల్లం కలిపి తాగడం వల్ల మలబద్దకం సమస్యని నివారించవచ్చు.
  2. ముసాంబరం ని తీసుకుని కొద్దిగా నీరు చేర్చి దంచి ముద్దగా తయారుచేయాలి. దీనిని చిన్న చిన్న ఉండలుగా సెనగ గింజల సైజు లో మాత్రలు చేసి నీడలో ఆరబెట్టాలి. వీటిని రోజుకి 1 చొప్పున తీసుకుంటుంటే దగ్గు, జలుబు ఇంకా శ్వాస సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
  3. ముసాంబరం చేదుగా ఉండటం వల్ల దీనిని పిల్లలు పాలు మాన్పించడంలో ఉపయోగిస్తారు. తల్లియొక్క చను మొనలకి ముసాంబరాన్ని పూయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.