ఔషద గుణాల ఖజానా – పుదీనా

November 1, 2019

సంవత్సరమంతా దొరికే ఆకుకూర పుదీనా. పుదీనాను వంటలలో మాత్రమే వాడుతుంటారు. ఎన్నో రుగ్మతలను దూరం చేసే పుదీన మన పెరట్లోనే ఉండటం విశేషం. పుదీనా లోని విశేషాలు, ఔషధ గుణాలు తెలిస్తే ఖచ్చితంగా మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటారు. పుదీన గురించి పూర్తిగా తెలుసుకుని ఆరోగ్యాంగా వర్ధిల్లండి.

medicinal value nutrition facts and health benefits of mint leaf

పోషకాలు: పుదీనాలో విటమిన్ A, B, B2 ఉంటాయి. వీటితో పాటు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, కొవ్వుపదార్ధాలు, పాస్పరస్, ఐరన్ లను కలిగిఉంటుంది.

ప్రయోజనాలు:

  1. అజీర్తి, గ్యాస్, ఉబ్బరం, కడుపునొప్పి, నులిపురుగులు లాంటి పొట్టకు సంబందించిన అన్ని సమస్యలకు పుదీనా మంచి పరిష్కారం. పుదీన రసంలో కాస్త తేనె , నిమ్మరసం కలిపి రోజు తీసుకుంటుంటే ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి.
  2. పుదీన ఆకుల్ని నమిలి తినడం వల్ల నోటి దుర్వాసన, పిప్పళ్లు, చిగుళ్ల నుండి రక్తం కారడం, దంతాలు కదలటం, టాన్సిల్స్ వంటి సమస్యలు దూరమవుతాయి.
  3. బహిష్టు నొప్పి కి ఎండిన పుదీన పొడి 2స్పూన్లు 2 గ్లాసుల నీటిలో కలిపి 1/2 గ్లాస్ అయ్యేంతవరకు మరిగించి చల్లార్చి తాగాలి. ఇలా పీరియడ్స్ రావడానికి 4 రోజుల ముందు నుండి చేయడం వల్ల బహిష్టు నొప్పి తగ్గడమేకాక పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి.
  4. ఎక్కిళ్ళు, దగ్గు, జలుబు, గొంతునొప్పి, నోటి దుర్వాసన వంటి సమస్యలకు పుదీన కాషాయం తీసుకోవడం, పుక్కిలి పట్టడం మంచి మెడిసిన్.
  5. వడదెబ్బకి మజ్జిగలో పుదీన రసం కలుపుకుని తాగడం, ఒంట్లో వేడి తగ్గడానికి పుదీన రసాన్ని శరీరానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చెమటపొక్కులు కూడా తగ్గిపోతాయి.
  6. కీళ్ల నొప్పులకు 1స్పూన్ కోకోనట్ ఆయిల్ లో 2,3 చుక్కల మెంథాల్ ఆయిల్ కలిపి కీళ్లపై మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యూలేషన్ పెరిగి ఉపశమనం పొందుతారు.
  7. 1స్పూన్ షుగర్ లో 2,3 చుక్కల మెంథాల్ ఆయిల్ కలిపి తీసుకోవడం వల్ల అజీర్ణ వికారాలు తగ్గుతాయి.
  8. పుదీన ఆకులను నలిపి వాసనా చూడటం వల్ల తల తిరగడం, తల నొప్పి వంటి సమస్యలు తగ్గిపోతాయి.
  9. పిప్పి పన్ను నొప్పి ఉన్నపుడు మెంథాల్ ఆయిల్ లో లవంగం నూనె కలిపి నొప్పి ఉన్నచోట పూయడం వల్ల నోప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
  10. 1స్పూన్ కోకోనట్ ఆయిల్ లో 2,3 చుక్కల మెంథాల్ ఆయిల్, కొంచం నిమ్మరసం కలిపి శరీరానికి అప్లై చేయడం వల్ల దోమలు దరిచేరవు.