నాజుకైన శరీరాకృతికోసం పిప్పళ్లు (Long Pepper)

July 3, 2019

పిప్పళ్లని దోరగా వేయించి పొడిచేసి వస్త్రకాళితం చేసి మెత్తని పొడిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రాత్రి భోజనం తరువాత 3 చిటికెల చొప్పున తేనెతో రంగరించి చప్పరిస్తూ మింగాలి. అలాగే పొద్దున్న భోజనం తరువాత కూడా ఇలాగే తీసుకోవాలి. రాను రాను ఈ పొడిని 3 చిటికెల నుండి 1/2 స్పూన్ వరకు తీసుకుంటూ ఉంటె మీ బానపొట్ట చాల త్వరగా తగ్గి నాజూగ్గా తయారవుతారు.