Kiwi fruit health benefits in Telugu

April 3, 2019

కీవి లోని పోషకాలు: మనం తీనేటువంటి దాదాపు 26 రకాల పండ్లలో కంటే కీవి పండులో ఎక్కువ పోషకాలుంటాయి. అంతే కాకుండా నారింజ, బత్తాయి వంటి పండ్లలో లభించే c విటమిన్ కంటే కీవి పండులో రెండు రెట్లు ఎక్కువగా c విటమిన్ లభిస్తుంది. అందుకే దీనిని “వండర్ ఫ్రూట్ ” అంటారు. ఇందులో విటమిన్ C, E ఉంటాయి. ఇందులో Folic acid కూడా ఉంటుంది. అంతేకాకుండా కాల్షియమ్ , మెగ్నీషియం , ఐరన్ కూడా లభిస్తాయి.

లాభాలు :

  1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 
  2. అధిక బరువును తగ్గించండంలో ఉపకరిస్తుంది. వీటిలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. 
  3. ఇది రక్త పోటును తగ్గిస్తుంది , షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. 
  4. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని కొలస్ట్రాల్, బీపీ ని అదుపులో ఉంచుతాయి. 
  5. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. 
  6. వీటిలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని దూరం చేయటంలో ఉపయోగపడుతుంది. 
  7. వీటిలో ఉండే ఫోలిక్ ఆసిడ్ గర్భిని స్త్రీలకు మంచిది. 
  8. కాన్సర్ కారకాలను నిరోధిస్తుంది. భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. 
  9. ఆపిల్ కంటే ఎక్కువ పోషకాలు కలిగి ఉంటుంది కనుక దీనిని తప్పక రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలి . 
  10. కంటి చూపును మెరుగుపరుస్తుంది.