కలోంజి లో దాగిఉన్న ఔషధ గుణాలు

August 23, 2019

కలోంజి సీడ్స్ ని బ్లాక్ సీడ్స్ లేదా బ్లాక్ క్యుమిన్ సీడ్స్ అంటారు. వేల సంవత్సరాల నుండి సాంప్రదాయ, ఆయుర్వేద వైద్యంలో వాడుతున్నారు. వీటి గురించి చాల మందికి తెలియదు కానీ జుట్టు దగ్గర నుండి పాదాల వరకు దాదాపుగా మన శరీరంలోని అన్ని అవయవాల ఆరోగ్యానికి మంచి మెడిసిన్. కలోంజి అందించే అమోఘమైన ప్రయోజనాలను తెలుసుకుని ఆచరించి ఆరోగ్యాన్ని పొందండి.

kalonji seeds health benefits and uses of black cumin seeds in telugu

పోషకాలు: కలోంజి లో విటమిన్, B1, B2, B3 లతో పాటు కాల్షియం, ఫోలిక్ ఆసిడ్, ఐరన్, కాపర్, జింక్, పాస్పరస్, వంటి పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ న్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది.

ప్రయోజనాలు:

 1. రక్త సరఫరాను మెరుగు పరిచి గుండె సమస్యలను రాకుండా నివారిస్తుంది.
 2. కలోంజి ఆయిల్ జుట్టుకి పట్టించడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. జుట్టు కుదుళ్ళని బలంగా చేస్తుంది. పాడైపోయిన, చిట్లిన జుట్టుని బాగుచేస్తుంది.
 3. ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్దీకరించే గుణం కలిగి ఉంటుంది కనుక షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది అమృతంతో సమానం.
 4. జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. రోగ నిరోధక వ్యవస్థని పటిష్టం చేస్తుంది.
 5. కాలేయం పనితీరుని మెరుగుపరుస్తుంది.
 6. కాన్సర్ ని తగ్గించలేదు కానీ కాన్సర్ కారకాలనీ సమర్దవంతంగా అడ్డుకుంటుంది.
 7. ఈ ఆయిల్ తో మసాజ్ చేసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వదు. ముఖం పై మచ్చలు మొటిమలు తగ్గిస్తుంది.
 8. బ్యాక్ పెయిన్ కి మంచిమందుగా చెప్పవచ్చు. ఈ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 9. ఎముకలను దృడంగా చేస్తుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్, అలర్జీలు బారి నుండి కాపాడుతుంది.
 10. పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
 11. కిడ్నీల పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది.
 12. ఒత్తిడిని తగ్గిస్తుంది. నరాల బలహీనత సమస్యలను తగ్గిస్తుంది.

గమనిక: 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ కలోంజి ఆయిల్ వేసి పరగడుపున తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల పైన చెప్పిన ప్రయోజనాలని పొందవచ్చు.