భృంగరాజ్ తైలం

July 3, 2019

భృంగరాజ్ మొక్క వళ్ళ పొందే ప్రయోజనాలను మనము తెలుసుకున్నాం. అయితే దీని ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే భృంగరాజ్ తైలం (గుంటగలగర ఆకూ తైలం) మంచి మార్గం. భృంగరాజ్ తైలం ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.

పల్లెటూళ్లలో విరివిగా దొరికే ఈ భృంగరాజ్ పట్టణ ప్రాంతాలలో దొరకడం చాల కష్టం. భృంగరాజ్ ఎండిన ఆకులూ లేదా పౌడర్ అన్ని ఆయుర్వేదిక్ స్టోర్స్ లో దొరుకుతున్నాయి. అందువల్ల పచ్చి ఆకులూ దొరకకపోతే ఎండిన ఆకులూ లేదా పౌడర్ తో ఈ ఆయిల్ ను తయారుచేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు:

  1. కప్పు- భృంగరాజ్ ఆకులని నూరి ముద్దగా చేసుకోవాలి/భృంగరాజ్ పౌడర్/భృంగరాజ్ ఎండిన ఆకులూ.
  2. కప్పులు- కొబ్బరి నూనె/నువ్వుల నూనె.

తయారుచేసే విధానం:

కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె 2 కప్పులు ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. దీనిలో 1 కప్పు భృంగరాజ్ నూరిన ఆకూ లేదా పౌడర్ లేదా ఎండిన ఆకులూ వేసి సన్నని మంట మీద 15-20 నిముషాలు వేడిచేయాలి. దీని వల్ల ఆకులలోని ఔషధ గుణాలు నూనెలో చేరుతాయి. ఈ ఆయిల్ చల్లారిన తరువాత ఒక గాజు సీసాలో వడకట్టి నిల్వ చేసుకోవాలి. తలస్నానం చేయడానికి 2 గంటల ముందు ఈ నూనెని కుదుళ్ళకి, జుట్టుకి బాగా అప్లై చేసి మసాజ్ చేయాలి. తరువాత మైల్డ్ షాంపూ తో లేదా హెర్బల్ షాంపూ తో తలస్నానం చేయాలి.ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటె మంచి ఫలితం ఉంటుంది.

ఇలా చేయడం వల్ల చిట్లిన జుట్టు తిరిగి ఆరోగ్యాంగా తయారవుతుంది.జుట్టు రాలటం తగ్గుతుంది. ఒత్తుగా పెరుగుతుంది. కాంతివంతంగా తయారవుతుంది. తలలో ఫుల్లు, చుండ్రు, పేళ్లు కూడా తగ్గుతాయి.