భృంగరాజ్ హెయిర్ ప్యాక్

July 3, 2019

ప్రస్తుతం పట్టణ ప్రాంతాలలో కాలుష్యాన్ని తట్టుకొని జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొంచం కష్టపడాలి.ఈ భృంగరాజ్ హెయిర్ ప్యాక్ అనేది జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి మార్గంగా చెప్పవచ్చు. అయితే ఈ హెయిర్ ప్యాక్ మన ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు:
1/2 కప్పు– భృంగరాజ్ ఆకుల పేస్ట్/పౌడర్
2 టేబుల్ స్పూన్– మెంతులు

తయారీవిధానం:

మెంతులను ముందురోజు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. మరుసటిరోజు మెంతులని మెత్తటి పేస్ట్ ల తయారుచేసుకోవాలి. ఇందులో భృంగరాజ్ పేస్ట్ లేదా పౌడర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకి బాగా పట్టించాలి. 1 గంట తరువాత తలస్నానమ్ చేసేటపుడు ముందుగా తలపై వాటర్ పోస్తూ తలకు పట్టించిన పేస్ట్ అంత పోయేలా నీటితో కడిగేయాలి. ఇది పూర్తిగా పోయిన తరువాత హెర్బల్ షాంపూ తో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటె మంచిఫలితం ఉంటుంది.

ఇలా తరుచు చేస్తూ ఉంటె పొల్యూషన్ వల్ల పాడైపోయిన జుట్టు తిరిగి ఆరోగ్యాంగా తయారవుతుంది.