భృంగరాజ్ తో నాచురల్ హెయిర్ డై

July 3, 2019

ఆరోగ్యమైన జుట్టును పొందాలంటే జుట్టుకు కావాల్సిన పోషణను అందించాలి. జుట్టుకి అన్నిరకాలుగా ఆరోగ్యాన్నిచ్చేది భృంగరాజ్. అందరు నాచురల్ రంగు కోసం, జుట్టు ఆరోగ్యం కోసం హెన్నా వాడుతారు. అయితే ఈ హెన్నాలో భుంగరాజ్ ను కలిపి వాడటం వల్ల జుట్టుకి మంచి పోషణను అందించిన వాళ్ళు అవుతారు.

ఈ నాచురల్ హెయిర్ డై కోసం కావాల్సిన పదార్థాలు:

  1. 2 టీ స్పూన్లు – భృంగరాజ్ చూర్ణం
  2. 2 టీ స్పూన్లు -గోరింటాకు చూర్ణం
  3. 2 టీ స్పూన్లు -ఉసిరిక చూర్ణం.
  4. 1 టీ స్పూన్ – టి పౌడర్

తయారుచేసే విధానం:

ఒక బౌల్ తీసుకొని అందులో ఈ చూర్ణాలన్నిటిని వేసి కలపాలి. వేరొక బౌల్ లో టీ డికాషన్ ని తయారుచేసుకోవాలి. ఈ డికాషన్ ను వడగట్టి పక్కన పెట్టాలి. ముందుగా అన్ని కలిపి ఉంచిన మిశ్రమంలో ఈడికాషన్ పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మసటిరోజు ఈ మిశ్రమాన్ని తలకి, జుట్టుకి బాగా పట్టించాలి. ఒక గంట తరువాత నీటితో కడిగేయాలి. షాంపూ వాడకూడదు. ఇలా చేయడం వల్ల జుట్టు కి మంచి రంగుతో పాటు పోషణ లభిస్తుంది.

ఇలా తరుచు చేస్తూ ఉంటె తెల్ల జుట్టు, గ్రే హెయిర్ నల్లబడటమే కాకుండా జుట్టు ఒత్తుగా, ఆరోగ్యాంగా తయారవుతుంది. అంతేకాకుండా తలలో ఫంగస్, దురద, పేల్లు పోయి జుట్టు కాంతివంతంగా తయారవుతుంది. అందువల్ల బయట కెమికల్స్ కలిపిన హెయిర్ డై లు వాడకుండా ఇంట్లోనే ఇలా తయారుచేసుకోవడం ఎంతో శ్రేయస్కరం.