పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలు

May 24, 2019

ఊపిరితిత్తులు పాడవడానికి కారణాలు ధూమపానం, ఇన్ఫెక్షన్లు, ఫంగస్ లాంటివి.వీటిలో ముఖ్యమైనది ధూమపానం. 5 సంవత్సరాలు ఎవరైతే ధూమపానం చేస్తూ ఉన్నట్లైతే వారిలో ఊపిరితిత్తులు బాగా పాడవ్వడం జరుగుతుంది.అయితే వీటికి సంబంధించి ఊపిరితిత్తులని బాగుచేయడానికి కొన్ని చిట్కాలు.

  1. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచే ఆహారపదార్థాలు అల్లం, మిర్చి, దానిమ్మపండ్లు, బ్రోకలీ, ఆప్రికాట్స్, ఉల్లిపాయలు, వెల్లుల్లి, బెర్రీస్, వాల్నట్స్, వంటి ఆహారపదార్థాలు రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇవి ఊపిరితిత్తులని సంరక్షించడమేకాక వాటి పనితీరుని మెరుగుపరుస్తుంది
  2. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని అన్ని అవయవాల పనితీరుని మెరుగుపరుస్తుంది.
  3. 2 గ్లాసుల నీటిని తీసుకుని వాటిని వేడిచేయాలి. అవి మరిగేటపుడు ఉల్లిపాయముక్కలు, అల్లం ముక్కలు వేసి బాగా మరిగించి కాషాయం తయారుచేసి అందులో తేనె కలిపి పరగడుపున తీసుకోవాలి. ఇలా 1-2 నెలలు చేస్తూ ఉంటె పాడైపోయిన ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
  4. డీప్ బ్రీతింగ్, ప్రాణాయామం, యోగ వంటి వాటి వల్ల కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.ప్రాణాయామం రోజుకి 1-3 టైమ్స్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  5. తేనె ని రోజువారీ ఆహరం లో చేర్చుకోవాలి.ఎందుకంటే తేనె ఊపిరితిత్తుతుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఆయుర్వేద గుణాలని కలిగిఉంటుంది.