ఉలవలు – ఆరోగ్య విలువలు

December 20, 2019

ఈ మధ్య కాలంలో ఆరోగ్యం గురించి శ్రద్ద అందరిలో పెరిగింది. దీనివల్ల మన పూర్వికులు వాడిన ఆహారపదార్థాలను తిరిగి ఇపుడు మల్లి వాడుకలోకి తెస్తున్నారు. అలాంటి ఆరోగ్యాన్ని పెంచే ఔషధ విలువలు కలిగిన ఆహారపదార్థాలలో అతి ముఖ్యమైనది ఉలవలు.
ఉలవలలో ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పాస్పరస్, ఫైబర్, ఐరన్ లు ఉంటాయి.

horse gram ulavalu nutritional value and health benefits in telugu

ప్రయోజనాలు:

 1. పిల్లల పెరుగుదలకు వీటిలో ఉండే కాల్షియం బాగా తోడ్పడుతుంది.
 2. జ్వరం, దగ్గు, ఆయాసం వంటి సమస్యలకు ఉలవల కషాయం మంచి మెడిసిన్.
 3. మధుమేహం అదుపులో ఉంచుతుంది.
 4. శరీరంలో పేరుకున్న కొవ్వుని కరిగిస్తుంది.
 5. రక్తం సాఫీగా సరఫరా జరిగేలా చేస్తుంది. తద్వారా గుండె సమస్యలను అరికడుతుంది.
 6. మూత్రపిండాలలో రాళ్లను కరిగిస్తుంది.
 7. మలమూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది.
 8. అధిక చెమట సమస్యను అరికడుతుంది.
 9. రుతుక్రమం ను సరిచేస్తుంది.
 10. పైల్స్ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.

గమనిక:

 1. ఏ రకంగా ఉలవలు తీసుకున్న సరే వీటితో పాటు మజ్జిగను అనుపానంగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఉలవలు శరీరానికి వేడిచేస్తాయి.