Home Made హెర్బల్ షాంపూ

June 19, 2019

పట్టణ ప్రాంతాలలో కాలుష్యం చాల ఎక్కువ అంతేకాకుండా అందరు చాల బిజీగ ఉండటం వల్ల అన్ని రెడీమేడ్ గ దొరకాలని కోరుకుంటున్నారు. మన జుట్టు ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మనం వాడే షాంపూ లు ఎంతవరకు శ్రేయస్కరమో తెలియదు. అందుకే మన కేశ సంరక్షణకు మన ఇంట్లోనే అందుబాటులో ఉన్న పదార్థాలతో షాంపూ తయారుచేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు:
2 – ఉల్లిపాయలు
100 గ్రామ్స్ – కుంకుడుకాయలు
100 గ్రామ్స్ – షికాయ
100 గ్రామ్స్ – మెంతులు
100గ్రామ్స్ – ఎండు ఉసిరి
4 – 5 కరివేపాకు రెమ్మలు

తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయలను ముక్కలుగా చేసి అందులో 1 లీటర్ నీళ్లు పోసి సన్నని మంటపై మరిగించాలి. ఆ నీటిని వడ కట్టి పక్కన పెట్టాలి. తరువాత కుంకుడుకాయలు, షికాయ, ఎండు ఉసిరిని ముక్కలుగా చేసి మెంతులు కలిపి పక్కన పెట్టిన ఉల్లిపాయ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటిరోజు ఈ మిశ్రమాన్ని 20 – 30 నిమిషాలవరకి మీడియం ఫ్లేమ్ లో మరిగించాలి. ఇది మరిగేటపుడు ఇందులో కరివేపాకు వేయాలి. వీటిలో ఇంకా మందార ఆకులు, వేపాకు కూడా కలుపుకోవచ్చు. ఇది బాగా మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లార్చాలి. తరువాత వడగట్టి ఒక గాజు సీసాలో పోసి ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకోవాలి. ఇది 15-30 రోజులవరకు నిల్వ ఉంటుంది.

గమనిక: స్నానం చేసే ముందు దీనిని తలకు బాగా పట్టించి కాసేపు ఆగక తలస్నానం చేయాలి. ఇలా వారానికి 2-3 చేయాలి.

ప్రయోజనాలు:

  1. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
  2. తలలో ఎలర్జీ, ఫుల్లు, పేళ్లు తగ్గిపోతాయి.
  3. జుట్టు చాల మెత్తగా, సిల్కీ గ తయారవుతుంది.
  4. చిట్లిన జుట్టును కూడా బాగుచేస్తుంది.
  5. చుండ్రు కూడా తగ్గిపోతుంది.