కాలిన గాయాలకు వంటింటి వైద్యం

August 6, 2019

  1. తేనె – తేనె యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. కాలిన గాయాలపై తేనె పూయడం వలన మంట తగ్గి చల్లగా ఉంటుంది. గాయం లోపలి భాగాన్ని కూడా మాన్పుతుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తుంది.
  2. పుదీనా ఆకులూ – పుదీనా ఆకులను పేస్ట్ ల తయారుచేసి కాలిన గాయాలపై లేపనం లాగా పూయాలి. ఇది ఆరిన తరువాత నీళ్లు చల్లి కడిగేయలి. బచ్చలి కూర ఆకులతో కూడా ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  3. అలోవెరా జెల్ – కాలిన చోట అలోవెరా జెల్ రాసి కాసేపు అలాగే ఉంచాలి. ఇలా చేయం వల్ల మంట తగ్గి గాయం త్వరగా మానుతుంది. అంతేకాకుండా ఇది డెడ్ స్కిన్ సెల్స్ ని కూడా తొలగిస్తుంది.
  4. టమాటో – టమాటో ని గుజ్జు లాగా చేసి గాయాలపైనా పూయడం వల్ల గాయాలను త్వరగా మాన్పడమే కాకుండా మచ్చలు లేకుండా చేస్తుంది.
  5. బంగాళాదుంప – బంగాళాదుంప ఉడికించిన పేస్ట్ ని కాలిన గాయాలపైనా రాసి 15 నిముషాలు ఉంచడం వలన నొప్పి, మంట తగ్గి మచ్చలు పడకుండా చేస్తాయి.
  6. తమలపాకు రసం – తమలపాకు రసం ను లేపనంగా రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తమలపాకు యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉండటం వల్ల గాయాన్ని త్వరగా మాన్పుతుంది.
  7. బంతి మొక్క గుజ్జుగా చేసి రాయడం వల్ల ఎలాంటి మచ్చ పడదు.
  8. గోరింటాకు ముద్దలో వెనిగర్ లేదా నిమ్మరసం కలిపి రాయడం వల్ల మంట తగ్గి గాయాలను మాన్పుతుంది.
  9. పసుపుతో తేనె కలిపి రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది, ఉల్లిపాయను అడ్డంగా కట్ చేసి పూయడం వల్ల నొప్పి తగ్గుతుంది.
  10. చల్లటి పాలను పూయడం, ఐస్ క్యూబ్ తో రాయడం, కొబ్బరి నూనె పూయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.