పుట్టగొడుగులు చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలు

June 18, 2019

ప్రకృతి అందించిన ఒక వింత పౌష్టికాహారం ఈ పుట్టగొడుగులు. ఎందుకంటే ఇది కొన్ని జంతు లక్షణాలను, కొన్ని మొక్క లక్షణాలను కలిగి ఉంటుంది.వీటిలో 90% నీరు ఉంటుంది.సోడియం ఉండదు.కనుక ఇది రక్తపోటుకి మంచి ఔషధం. పుట్టగొడుగులు తెలుపు, గోధుమ రంగులలో దొరుకుతాయి.ఇవి చూడటానికి ఎలా ఉన్న ఇవి అందించే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు. ఇది రుచికి శాకాహారానికి మాంసాహారానికి మధ్యగా ఉంటుంది. వీటినుడి మాంసకృతులు ఎక్కువగా లభిస్తాయి.

పోషకాలు: వీటిలో విటమిన్ d చాలా ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ c కూడా లభిస్తుంది. కాలరీలు చాల తక్కువగా కలిగి ఉంటుంది. వీటితోపాటు పొటాషియం, కాపర్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కొవ్వుపదార్ధాలు తక్కువ. యాంటీఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది.

ప్రయోజనాలు:

  1. ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  2. బోలు ఎముకల వ్యాధిని రాకుండా నివారిస్తుంది.
  3. రొమ్ము కాన్సర్ రాకుండా నిరోధిస్తుంది.
  4. పెరలాసిస్(పక్షవాతం) ముప్పును అరికడుతుంది.
  5. రక్తపోటుకు మంచి మెడిసిన్.
  6. కండరాల పుష్టికి మంచి ఆహారం.
  7. షుగర్ వ్యాధిని కంట్రోల్ లో ఉంచుతుంది.
  8. రక్తకణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
  9. గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి స్నేహకారిగా ఉంటుంది.
  10. బరువు తగ్గాలనుకునేవారు, రక్తపోటు ఉన్నవారు పుట్టగొడుగులు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవటం మంచిది.