నిమ్మ లోని పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

April 7, 2019

పోషకాలు : సిట్రస్ జాతికి చెందిన కాయ నిమ్మ దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ A, B కాంప్లెక్స్, ఐరన్, కాల్షియమ్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, పెక్టిన్, ఫైబర్ కూడా ఉంటాయి. నిమ్మలో ఇంకా యాంటీ వైరల్ యాంటీ బాక్టీరియల్ గుణాలుంటాయి .

నిమ్మ వల్ల కలిగే లాభాలు :

  1. గుండెలో మంట, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది .
  2. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది.
  3. నిమ్మ రసంలో తేనే కలుపుకొని త్రాగటం వలన బరువు తగ్గటమే కాకుండ నోటి దుర్వాసన, చిగుర్ల ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
  4. చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది, ముడతలు, దదుర్లు రాకుండా చేస్తుంది.
  5. మలబద్దకాన్ని నివారించి , పైల్స్ రాకుండా నిరోధిస్తుంది.
  6. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలోని విషపదార్దాలను బయటికి పంపిస్తుంది.
  7. బిపి ని కంట్రోలులో ఉంచుతుంది. కీళ్ళ నొప్పులను నివారిస్తుంది .
  8. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది, పనితీరుని మెరుగుపరుస్తుంది.
  9. జలుబు, జ్వరం నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.
  10. శరీరం దుర్వాసన లేకుండా చేస్తుంది.