అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మా

April 29, 2019

రాజ్ మా గింజలు కిడ్ని ఆకారంలో ఉంటాయి. అందుకే వీటిని కిడ్నీ బీన్స్ అంటారు, వీటిని పవర్ హౌస్ అఫ్ ప్రోటీన్స్ గా పిలుస్తారు. మాంసం లో కంటే ఎక్కువ ప్రోటీన్స్ వీటిలో ఉంటాయి కనుక శాకాహారులకు మంచి పౌష్టికాహారం గా చెప్పవచ్చు.

రాజ్ మా లోని పోషకాలు:

విటమిన్ B6, E, K, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషయం, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజ లవణాలతో పాటు కాపర్, ఒమేగా ఫ్యాటి ఆసిడ్స్ లభిస్తాయి, దీనిలో ఫైబెర్ ఎక్కువగా కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి.

రాజ్ మా వలన లాభాలు:

  1. రక్తహీనతను తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.
  2. బోజనం తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించడంలో రాజ్ మా లొని ప్రోటీన్స్ ఎంతగానో తోడ్పడుతాయి.
  3. షుగర్ వ్యాధిని తగ్గించడంలో సహాయపడుతుంది, అందువల్ల షుగర్ వ్యాధిగ్రస్థులు తమ రెగ్యులర్ డైట్ లో వీటిని తీసుకోవడం మంచిది.
  4. మాంసాహారం కన్నా ఎక్కువ శక్తిని శరీరానికి అందిస్తుంది, అందువల్ల శాకాహారులకు మంచి ఎనర్జిటిక్ ఫుడ్ గా చెప్పవచ్చు.
  5. యాంటి ఏజింగ్ లక్షణాలను కలిగివుంటుంది, అందువలన ముసలితనాన్ని దరిచేరనివ్వదు.
  6. దీనిలో ఫైబర్ అధిక మోతాదులో ఉండడం వలన కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. మలబద్దక సమస్యను తొలిగిస్తుంది.
  7. జీర్ణక్రియ ను మెరుగుపరుస్తుంది, శరీర మెటబాలిజం రేటును పెంచుతుంది.
  8. వీటిలో వుండే యాంటీ యాక్సిడెంట్స్ శరీరాన్ని ప్రీరాడికల్స్ బారినుండి కాపాడుతుంది. శరీరానికి హనిచేసే టాక్సిన్స్ ను మలినాలను విసరగించడం లో ఉపయోగపడుతుంది.
  9. ఎముకలను బలంగా చేస్తుంది, క్రీడాకారులకు మంచి ఆహారం.జుట్టు మరియు గొర్ల ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది
  10. మైగ్రేన్, కీళ్ల నొప్పులనుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మతి మరుపు ని తగ్గించి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.