మానవుల పాలిట అమృత కలశం – ఆముదం చెట్టు

July 30, 2019

ఆముదం ను సంస్కృతంలో పంచాంగులి, వర్ధమాన అంటారు. ప్రాచీన కాలంలో మన పూర్వీకులు ఆముదంను విరివిగా వాడి చాల ఆరోగ్యవంతులుగా ఉండేవారు. 100లకు పైగా రోగాలను నయం చేయడంలో ఈ ఆముదం ను ఇప్పటికి వాడుతున్నారు. ఆముదం ఆకులు, వేళ్ళు, కాయలు, గింజలు అన్ని ఔషధ గుణాలని కలిగి ఉంటాయి. జుట్టు దగ్గర నుండి పాదాల వరకు అనేక రుగ్మతల నివారణలో దీనిని వాడుతున్నారు. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలందించే ఈ చెట్టు మానవుల పాలిట అమృత కలశం లాంటిది. ఈ చెట్టు గురించి, దీని ఔషధ గుణాల గురించి తెలుసుకోకపోతే నష్టపోతారని చెప్పవచ్చు.

ప్రయోజనాలు:

  1. కీళ్లనొప్పులు – ఆముదం ఆకులపైనా నువ్వులనూనె రాసి కాస్త వేడిచేసి నొప్పి ఉన్నచోట కట్టుకట్టాలి. ఇలా చేయడం వళ్ళ నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
  2. మొలల సమస్య – కర్పూరం, ఆముదం ఆకులు కలిపి దంచి పేస్ట్ ల తయారుచేయాలి. దీనిని మలద్వారం దగ్గర పూయాలి లేదా కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల మొలల సమస్య తగ్గుముఖం పడుతుంది.
  3. పచ్చకామెర్లు – ఆముదం లేత ఆకులు, వెల్లుల్లి కలిపి నూరి రోజు 2 సార్లు తీసుకుంటుంటే పచ్చకామెర్లు సమస్యను అరికట్టవచ్చు.
  4. పాల వృద్ధికి – బాలింతలలో పాలు తక్కువగా ఉంటే వారి స్థనాలపైన ఆముదం పూసి, ఆముదం ఆకులను వేడిచేసి కాపుడం పెట్టడం వల్ల పాల వృద్ధి ఉంటుంది.
  5. పులిపిరుల సమస్య – పులిపిరులు ఉన్నవారు తరుచు వాటిపైన ఆముదం పూస్తూ ఉంటే కొద్దిరోజులకు అవి రాలిపోతాయి.
  6. సయాటికా నొప్పి – 4, 5 ఆముదం గింజలను నలగొట్టి పాలలో వేసి మరిగించి వడగట్టి తాగడం వల్ల నడుం నొప్పి, సయాటికా బాధించదు.
  7. మలబద్దకం – 1 గ్లాస్ వేడి పాలలో 1స్పూన్ ఆముదం ను కలిపి రాత్రిపూట తీసుకుంటుంటే ఈ సమస్య తగ్గుతుంది.
  8. ఋతు సమయంలో నొప్పి తగ్గడానికి ఆముదం ఆకుల్ని వేడిచేసి పొత్తికడుపుపై కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గిపోతుంది.
  9. డ్రై స్కిన్ ఉన్నవారు 1/2 కప్ ఆముదం, కర్పూర థైలం, బాదాం నూనె కలిపి మర్దన చేస్తూ ఉంటే చర్మం మృదువుగా తయారవుతుంది.
  10. జుట్టు కుదుళ్ళకి ఆముదం పట్టించడం వల్ల జుట్టు మృదువుగా, ఒత్తుగా తయారవుతుంది. అంతేకాకుండా చుండ్రు, జుట్టు చిట్లడం సమస్య తగ్గిపోతుంది.
  11. రాత్రి పడుకునే ముందు కాళ్ళకి, చేతులకి ఆముదం రాసుకోవడం వల్ల మృదువుగా తయారవుతాయి.
  12. ఆముదం తో ఒంటికి మసాజ్ చేసుకొని, వేడి నీటితో స్నానము చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది.

గమనిక:

  1. మలబద్దకం కోసం ఎక్కువరోజులు ఆముదం వాడటం వల్ల మలబద్దకం పెరిగే అవకాశం ఉంది.
  2. గర్భవతులు మొదటి 3-4 నెలలు ఆముదం వాడకూడదు. అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది.