చలికాలంలో ఉసిరికాయలు ఎక్కువగా లభిస్తాయి. ఉసిరికాయల్లో విటమిన్ C, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ సీజన్లో లో ఉసిరికాయలు తినడం, వంటలు చేసుకోవడం అందరు చేస్తారు. ఉసిరి జ్యూస్ గురించి మాత్రం చాల తక్కువ మందికే తెలుసు. ఈ ఉసిరి జ్యూస్ తీసుకోవడం వళ్ళ కలిగే ప్రయోజనాలు చాల ఉన్నాయి. కానీ ఇది ఒక సీజనల్ ఫ్రూట్. అందువల్ల దీని యొక్క జ్యూస్ ప్రతి సీజన్లో మనం తీసుకోలేము. కానీ ఈ ఉసిరి జ్యూస్ అన్ని ఆయుర్వేద స్టోర్స్ లో, అన్ని సీజన్లో దొరుకుతున్నాయి. అందువల్ల దీనిని ప్రతి రోజు తీసుకుంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.
ఉసిరి జ్యూస్ తీసుకోవడం వళ్ళ కలిగే ప్రయోజనాలు:
- కాలేయంలో ఉండే టాక్సిన్స్ ని తొలగిస్తుంది.
- కంటిచూపుని మెరుగుపరుస్తుంది.
- యాంటీ ఏజింగ్ గ పని చేస్తుంది.
- జుట్టు కుదుళ్ళని గట్టిపరిచి, జుట్టు ఊడకుండా ఆరోగ్యాంగా పెరిగేలా చేస్తుంది.జుట్టు తెల్లబడటాన్ని ఆపుతుంది.
- శరీరాన్ని చల్లబరుస్తుంది. మల మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది.
- శరీరాన్ని దృడంగా, బలంగా చేస్తుంది.
- ఇన్సులిన్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. రక్తంలో చెక్కర శాతాన్ని తగ్గిస్తుంది.
- వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
- తిన్న సరిగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మలబద్దకం సమస్యని నివారిస్తుంది.
- ఎముకలను, దంతాలని దృడంగా చేస్తుంది.