అల్ బుకర చూడటానికి ఎరుపు రంగులో చాలా ఆకర్షణీయంగా చిన్న సైజు ఆపిల్ లాగా ఉంటాయి. రుచికి కొంచెం తియ్యగా, పుల్లగా కాస్త వగరుగా ఉంటాయి. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే పండ్లు ఇవి. ఈ వర్షాకాలం లో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ పండ్లు బాగా ఉపకరిస్తాయి. ఏ సీజన్లో అయినా సరే మానవ శరీరానికి కావాల్సిన పోషకాలు, ఖనిజ లవణాలను అన్నింటిని ప్రకృతి పండ్ల రూపంలో మనకు అందిస్తుంది. వాటిని స్వీకరించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
పోషకాలు :- ఈ పండ్లలో విటమిన్ c చాల ఎక్కువగా ఉంటుంది. విటమిన్a, b6 కూడా లభిస్తుంది. ఇంకా పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్, ఉంటాయి. వీటిలో ఫోలిక్ ఆసిడ్, సిట్రిక్ ఆసిడ్, ఫైబర్ అధిక మోతాదులో ఉంటాయి. ఈ పండ్లు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి కెలొరీస్, కార్బోహైడ్రేట్స్, కొవ్వుపదార్ధాలు చాలా తక్కువ మోతాదులో కలిగి ఉంటుంది.
ప్రయోజనాలు :-
- తక్షణ శక్తినిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థని పటిష్టం చేస్తుంది.
- జీవక్రియ రేటుని పెంచుతుంది.శరీర ఉష్ణోగ్రతని సమతుల్యం చేస్తుంది.
- ఎముకల పటుత్వానికి తోడ్పడుతుంది. బోలు ఎముకల వ్యాధి రాకుండా నిరోధిస్తుంది. ఎముకల సామర్థ్యం పెంచడంలో అన్ని డ్రై ఫ్రూట్స్ లో ఇది మేలైనది.
- కాన్సర్ కారకాలను నిరోధిస్తుంది. బ్రెస్ట్ కాన్సర్ నివారణలో మంచి ఫలితాలనిస్తుంది. అల్జీమర్స్ వ్యాధిని నయంచేయడంలో ఉపకరిస్తుంది.
- యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉండటం వళ్ళ జ్వరానికి మంచి మెడిసిన్ ల ఉపయోగపడుతుంది.
- జీర్ణవ్యవస్థని పటిష్టం చేస్తుంది. మలబద్దకం సమస్యని నివారిస్తుంది.
- ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల యెర్ర రక్తకణాల వృద్ధికి తోడ్పడుతుంది. రక్తలేమి సమస్యను పరిష్కరిస్తుంది.
- షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం. ఎందుకంటె ఇది వెంటనే గ్లూకోస్ గా మారి రక్తం లో చేరదు.
- దీనిలోని ఫోలిక్ ఆసిడ్ గర్భిణీ స్త్రీలకి మంచిది. గర్భస్థ శిశువు ఎదుగుదలకు బాగా ఉపకరిస్తుంది.
- జుట్టు ఒత్తుగా పెరగడంలో సహాయపడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది.