బ్లూ బెర్రీస్ గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు

June 3, 2019

సాధారణంగా అందరు అన్ని పండ్లతో పాటు బ్ల్యూబెర్రీస్ ని తీసుకుంటారు. కానీ వాటిలో ఉండే మెడిసినల్ వాల్యూస్ చాల మందికి తెలియదు. వీటి గురించి తెలిస్తే వీటిని మీ పిల్లలకే కాకుండా మీరు కూడా తప్పకుండ రోజువారీ ఆహరంలో చేర్చుకుంటారు.

పోషకాలు:- బ్ల్యూబెర్రీస్ లో ఫైబర్ అధిక మోతాదులో లభిస్తుంది. వీటిలో విటమిన్ a, b6, c ఎక్కువగా ఉంటాయి. ఉసిరి నుండి లభించేంత c విటమిన్ వీటి ద్వారా పొందవచ్చు. వీటిలో ఇంకా పొటాషియం, మాంగనీస్, కాపర్, పాస్పరస్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.

బ్లూ బెర్రీస్ వలన కలిగే ప్రయోజనాలు:-

  1. బ్లూ బెర్రీస్ లో ఫ్లెవనాయిడ్స్ పుషకాలంగా ఉన్నందువల్ల ఇవి మెదడు కణాలు పడవడాన్ని నివారిస్తుంది మరియు మతిమరుపు కలుగకుండా అడ్డుకునే ఫోటోకెమికల్స్ వీటిలో ఉంటాయి.
  2. బ్లూ బెర్రీస్ బాగా కొవ్వు వున్నా ఆహారాన్ని సైతం చాల తేలిగ్గా కరిగించేస్తాయి అని ఇటీవల పరిశోధనల్లో తేలింది.
  3. మెదడుకు సంబందించిన నాడీవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది.
  4. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది.రోగ నిరోధక వ్యవస్థని పటిష్టం చేస్తుంది.
  5. చర్మంపైన ముడతలని, స్పాట్స్ ని తగ్గించి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కేశ సంరక్షణకు మంచి ఆహారంగా చెప్పవచ్చు.
  6. అల్ఫాహారం లో వీటిని తీసుకోవడం వల్ల దంతక్షయాన్ని తగ్గించవచ్చు.
  7. జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది.
  8. యూరినరీ ఇన్ఫెక్షన్స్ ని రాకుండా నివారిస్తుంది.
  9. కాన్సర్ వ్యాధి కారకాలను నిరోధిస్తుంది,రాకుండా నివారిస్తుంది.
  10. కంటి రెటీనా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మంచి మెడిసిన్ గ పనిచేస్తాయి బ్లూ బెర్రీస్.