నోని ని సంస్కృతంలో “అశ్యుక” అంటారు. అశ్యుక అంటే ఆయుష్షును పెంచేది అని అర్ధం. అన్ని ఔషదాలు, విటమిన్లు, ఆరోగ్య కారకాలు కలిగినదే నోని. ఆరోగ్యవంతమైన జీవనం కోసం అందరు ఇపుడు సాంప్రదాయ వైద్యం వైపు మొగ్గుచూపుతున్నారు. 2000 వేళ సంవత్సరాలకు ముందే దీనికి చాల ప్రాధాన్యం ఉంది. తరువాత ఆదరణ తగ్గింది. ఇప్పటి ఆధునిక పరిశోధనలలో దీనిలోని పోషక విలువలు గుర్తించడంతో శాస్త్రీయ ప్రపంచంలో తిరిగి ప్రాధాన్యతను సంపాదించుకుంది.
ప్రయోజనాలు:
- యాంటీ ఏజింగ్ గాపనిచేస్తుంది.
- చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
- ఆర్థరైటిస్ సమస్య నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది
- జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది.
- షుగర్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.
- గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటుని తగ్గిస్తుంది.
- నాడీవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది.
- జ్ఞాపక శక్తిని పెంచుతుంది, మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది.
- శరీరంలోని టాక్సిన్స్ ని బయటకి పంపిస్తుంది.
- శరీరాన్ని అలర్జీల బారినుండి రక్షిస్తుంది.