అందం, ఆరోగ్యాలనందించే నారింజ

September 24, 2019

పోషకాలు: సిట్రస్ జాతికి చెందిన పండ్లలో నారింజ ఒకటి. వీటిలో విటమిన్ C పుష్కలంగా లభిస్తుంది. ఈ పండ్లలో B కాంప్లెక్స్, బీటాకెరోటిన్, మాంగనీస్, కాల్షియం, ఐరన్, సిట్రిక్ ఆసిడ్ ఉంటాయి. వీటిలో కాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.

ప్రయోజనాలు:

  1. జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. మలబద్దకం తగ్గిస్తుంది.
  2. వికారాన్ని, అరుచిని తగ్గిస్తుంది. తక్షణ శక్తినిస్తుంది. తలనొప్పి, జలుబు సమస్యకి మంచి రెమెడి.
  3. ఈ జ్యూస్ గుండె, కాలేయం, మూత్ర పిండాల ఆరోగ్యానికి చాల మంచిది. గుండె జబ్బులు వచ్చే సమస్యను 20% తగ్గిస్తుంది.
  4. ఈ జ్యూస్ లో కొంచం ఉప్పు, మిరియాలపొడి కలిపి తాగితే ఉబ్బసం సమస్య తగ్గుతుంది.
  5. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.యాంటీ ఏజింగ్ గ పనిచేస్తుంది. చర్మాన్ని ప్రీ రాడికల్స్ రక్షిస్తుంది.
  6. నీరసాన్ని తగ్గించి, ఆకలిని పెంచుతుంది. ఒంటికి చలువ చేస్తుంది, దాహాన్ని తీరుస్తుంది.
  7. ఈ జ్యూస్ ని తరుచు తీసుకుంటుంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కిడ్నీ సంబంధ వ్యాధులను దరిచేరనివ్వదు.
  8. దంత సమస్యలను, నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. కంటి,ఎముకల ఆరోగ్యానికి మంచిది.
  9. కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది.
  10. వీటి తొక్కలని ఎండబెట్టి పొడిచేసి సున్నిపిండితో కలిపి వాడటం వళ్ళ చర్మం రంగు నిగారిస్తుంది.