ఉగాది పండుగ, పచ్చడి విశిష్టత:

April 6, 2019

ప్రతీ యేడాది చైత్రశుద్ద పాడ్యమి రోజు ప్రపంచంలో ఏచోట ఉన్నా తెలుగు వారందరూ జరుపుకునే తొలిపండుగ ఉగాది. యుగానికి ఆదిగా జరుపుకునేది గనుక దీనిని యుగాది అనికూడా అంటారు. తెలుగు వారి నూతన సంవత్సరం చైత్ర మాసంతోనే ప్రారంభం అవుతుంది. అందుకే ఉగాదిని నూతన సంవత్త్సరాది అనికూడా అంటారు. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన తొలిరోజుగా ఉగాదిని జరుపుకుంటారని ప్రతీతి.

ఉగాది రోజు ఉగాది పచ్చడి ప్రత్యేకం .షడ్రుచుల మేళవింపుతో తయారుచేసే ఉగాది పచ్చడిలో ఔషధ లక్షణాలు, ఆయుర్వేద గుణాలు ఉన్నాయి.

తీపి, పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పు ఇలా ఆరు రుచులతో ఉగాది పచ్చడిని తయారుచేస్తారు. ఈ షడ్రుచులను జీవితంలో ఎదుర్కునే సుఖ దుఃఖాలకు సంకేతంగా చెప్తారు.

ఉగాది పచ్చడిలో వాడే పదార్థాలు:
వేపపువ్వు, బెల్లం, చింతపండు, పచ్చిమామిడికాయ, ఉప్పు, మిరియాలు

ఉపయోగాలు:

  1. వేపపువ్వు:- వేపపువ్వు యాంటి బాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. అతిసార వ్యాదులనుండి కాపాడి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
  2. బెల్లం:- రక్తాన్ని శుద్ధి చేస్తుంది, జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది.
  3. చింతపండు:- మలబద్దకాన్ని,నీరసాన్ని తగ్గిస్తుంది.ఆకలిని పెంచుతుంది,డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది.
  4. పచ్చిమామిడి:- గుండె,కాలేయ ఆరోగ్యానికి చాలామంచిది. జీర్ణ వ్వ్యవస్థని మెరుగుపరుస్తుంది.
  5. మిరియాలు:- కఫ సమస్యలని తగ్గిస్తుంది. శరీరఉష్ణోగ్రతని సమతుల్యం చేస్తుంది.
  6. ఉప్పు:- వేసవి తాపం వల్ల శరీరం కోల్పోయిన లవణాన్ని అందిస్తుంది.