వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

- వేడిగా ఉండే తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి.
- డయేరియా రాకుండా ఇంట్లో ప్యూరిఫై చేసిన నీటిని తాగండి.
- కఫాన్ని పెంచే ఆహారపదార్థాలు(కూల్డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ లాంటివి) తీసుకోకపోవడం మంచిది.
- పసుపు వేసిన పాలు తీసుకోవడం మంచిది.
- పిల్లల్లో ఈ సీజన్లో జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వస్తూ ఉంటాయి. అందుకే పిల్లల్ని ఎక్కువగా వానలో తడవకుండా పొడిగా ఉండేలా చూసుకోండి.
- రోడ్ సైడ్ ఫుడ్ (పానీపూరీ లాంటివి) తీసుకోకండి.
- వాము కాషాయం, నేరేడు ఆకుల కాషాయం సేవించడం వల్ల ఈ సీజన్లో లో వచ్చే సమస్యలకి చెక్ పెట్టవచ్చు.
- ఎక్కువగా నీళ్లలో తడవడం వళ్ళ కాళ్ళకి ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంది.అందువల్ల కాళ్ళు చేతులు పొడిగా ఉండేలా చూసుకోండి.
- c విటమిన్ విటమిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది.
- వేడి నీరు సేవించడం, వేడినీళ్లలో ఉప్పు వేసి పుక్కిలించడం వల్ల కఫము తగ్గుతుంది.
Related