డెంగ్యూ వ్యాధి కారణాలు, లక్షణాలు, నివారణ మార్గాలు

September 29, 2019

వర్షాకాలంలో అంటువ్యాదులు వచ్చే అవకాశాలు ఎక్కువ. వాతావరణం లో తేమ ఎక్కువగా ఉంటుంది అందువల్ల బాక్టీరియా తొందరగా వ్యాప్తి చెందుతుంది. ఈ సీజన్లో లో డయేరియా, మలేరియా, టైఫాయిడ్, నిమోనియా, డెంగ్యూ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. వీటన్నిటిలో ప్రమాదకరమైన అంటివ్యాది డెంగ్యూ.

dengue fever symptoms and precautions in telugu

డెంగ్యూ వ్యాధి కారణాలు:
ఈ డెంగ్యూ వ్యాధి దోమల ద్వారా వ్యాప్తిచెందుతుంది. Aedes Aegypti అనే దోమ కుట్టడం వళ్ళ ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలు పగటిపూటనే కుడతాయి. ఇది కుట్టిన 5-8 రోజుల తరువాతనే ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. డెంగ్యూ వ్యాధి వచ్చిన వ్యక్తిని కుట్టిన దోమ వేరొకరిని కుట్టిన ఈ వైరస్ వ్యాపిస్తుంది.

డెంగ్యూ వ్యాధి లక్షణాలు:

  1. తీవ్రమైన తలనొప్పి, జ్వరం.
  2. వికారం, వాంతులు.
  3. కీళ్లనొప్పులు.
  4. రక్తస్రావం – వ్యాధి తీవ్రత ఎక్కువైతే ముక్కు నుండి రక్త స్రావం జరుగుతుంది.
  5. వ్యాధి తీవ్రమైతే రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య పడిపోతుంది. తద్వారా ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందువల్ల వ్యాధి లక్షణాలు కనిపించగానే తప్పక డాక్టర్ ని సంప్రదించాలి.

డెంగ్యూ వ్యాధి నివారణ మార్గాలు:
డెంగ్యూ ని నిర్ములించడానికి ఎలాంటి టీకాలు లేవు. నివారణ ఒక్కటే మార్గం. అందుకే దోమలు కుట్టకుండా చూసుకోవాలి. పిల్లలు, పెద్దలు అందరూ శరీరం మొత్తం కప్పి ఉండే దుస్తులు ధరించాలి. పరిసర ప్రాంతాలు శుభ్రంగా, నీరు నిలవకుండా, తేమ లేకుండా ఉండేలా చూసుకోవాలి. దోమ తెరలు వాడాలి. దోమలను నిర్ములించే రసాయనాలు వాడి దోమలు దరిచేరకుండా చేసుకోవాలి.