అమృతఫలం ఈ సీతాఫలం

October 19, 2019

తలచుకోగానే నోట్లో నీరు ఊరే పండు సీతాఫలం. ఇది చాల తక్కువ రోజులు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటె ఇది ఒక సీజనల్ ఫ్రూట్. ఫ్రూట్ లవర్స్ వీటికోసం ఎదురుచూస్తూ ఉంటారు. అంత అమోఘమైన రుచిని కలిగి ఉంటుంది ఈ పండు. అంతేకాదు ఈ పండు అందించే ఆరోగ్య ప్రయోజనాలు అమోఘమే.

custard apple nutrition facts and health benefits

పోషకాలు: ఈ పండ్లలో విటమిన్ A, B6, C ఉంటాయి. కాపర్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, సల్ఫర్ ఇంకా ఫైబర్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ , ప్రక్టోజ్ ఉంటాయి. కొవ్వుపదార్ధాలు ఉండవు.

ప్రయోజనాలు:

 1. ఎముకలకు శక్తినిస్తుంది. దృడంగా చేస్తుంది.
 2. గుండె జబ్బులనుండి రక్షిస్తుంది. చెడు కొలస్ట్రాల్ ను తొలగిస్తుంది.
 3. మలబద్దకం తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది.
 4. కీళ్ల సమస్యకు మంచి పరిష్కారం.
 5. పురుషులలో నరాల బలహీనత సమస్యను అరికడుతుంది. కండ పుష్టికి సులువైన మార్గం.
 6. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త హీనతను తగ్గిస్తుంది.
 7. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. దృష్టి లోపాలని సరిచేస్తుంది.
 8. సీత ఫలం ఆకులను పసుపుతో కలిపి పేస్ట్ ల తయారుచేసి గాయాలకు లేపనం లాగా పూస్తే త్వరగా మానిపోతాయి.
 9. సీతాఫలం గింజలు పొడిచేసి ఆయిల్ లో కలిపి కుదుళ్లకు పట్టిస్తే పేళ్లు, చుండ్రు సమస్య తగ్గిపోతుంది.
 10. దంతాల వాపు, రక్తం కారడం లాంటి సమస్యలకు ఈ ఆకుల రసం పూస్తూ ఉంటె సమస్య క్రమంగా తగ్గిపోతుంది.

గమనిక:

 1. పరగడుపున తినకూడదు. ఎక్కువగా తినకూడదు.
 2. సీతాఫలం గుజ్జును తేనె తో కలిపి తింటే బరువు పెరుగుతారు.