అద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు

January 23, 2020

మన శరీరానికి కావల్సిన విటమిన్ లలో ముఖ్యమైనది A. ఇది ముక్యంగా కూరగాయలు, ఆకు కూరల నుండి లభిస్తుంది. అయితే ఈ ఆకు కూరలలో విటమిన్ A డైరెక్టుగా లభించదు. ఆకు కూరలలో ఉండే బీటాకెరోటిన్ ను మన లివర్ విటమిన్ A గా మార్చుతుంది. అయితే మనకు దొరికే ఆకు కూరలన్నిటిలో విటమిన్ A కరివేపాకులో చాల ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందువల్ల కరివేపాకును సువాసన కోసం మాత్రమే కాకుండా వీటిలోని ఔషధ గుణాలను పొందడానికి తప్పకుండ మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

ప్రయోజనాలు :

  1. కంటి చూపుని మెరుగుపరుస్తుంది.
  2. జుట్టు ఊడిపోకుండా, నల్లగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.
  3. జీర్ణ శక్తిని పెంచుతుంది, జీర్ణ వ్యవస్థని పటిష్టం చేస్తుంది.
  4. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెరగకుండా అదుపులో ఉంచుతుంది.
  5. బరువుని అదుపులో ఉంచుతుంది.