మలబద్దకాన్ని తరిమికొట్టె సులువైన చిట్కాలు

June 10, 2019

మలబద్దకం రావడానికి చాల కారణాలుంటాయి.అన్నింటికంటే ముఖ్యమైనది నీరు.రోజుకి కనీసం 3-4 లీటర్ల నీటిని మనం శరీరానికి అందించాలి.అలాగే తగినంత ఫైబర్ మన ఆహారంలో ఉండేవిదంగా చూసుకోవాలి.జంక్ ఫుడ్స్ ని తగ్గిచాలి.ఆహార వేళలు పాటించకపోవడం, గాస్, పైల్స్ , తేన్పులు ఎక్కువగారవటం ఇవన్నీ మలబద్దకాన్ని అనుబంధ లక్షణాలుగా చెప్పవచ్చు.

మలబద్దకాన్ని తరిమికొట్టె చిట్కాలు:

  1. ప్రతీరోజు మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా 5-6 లీటర్ల నీటిని తీసుకోవాలి.
  2. మలబద్దకం సమస్య ఎక్కువగా ఉన్నపుడు ఆముదం రోజు రాత్రిపూట 2 స్పూన్లు తీసుకోవాలి.డైరెక్ట్ గ తీసుకోలేకపోతే వేడి పాలలో కలిపి తీసుకోవాలి.ఇలా 4-6 రోజులు చేయాలి.
  3. రోజువారీ ఆహారంలో పీచు పదార్థాలు (ఫైబర్) ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి.
  4. కరక్కాయపొడి 1/2 టీ స్పూన్ వేడినీటిలో కలిపి త్రాగాలి.
  5. రోజువారీ ఆహారంలో తాటిబెల్లం ఉండేలా చూసుకోవాలి.
  6. మూసంబరం పొడి(అలోవెరా జెల్ పౌడర్ ), పసుపు వేడి నీళ్లలో మరిగించి బెల్లం కలిపి తాగాలి.
  7. ప్రతీరోజు పరగడుపున వేడినీళ్లు నిమ్మరసం తో కలిపి తాగాలి.