ఇది ఒక పోషకాహార లోపం. ఇండియా లో దాదాపుగా 52% ఈ సమస్య ఉంది. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ అవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
శరీర బాగాలకి రక్తాన్ని సరఫరా చేస్తూ రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ శరీరం అంతటికి ఆక్సిజన్ ని సరఫరా చేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ అవడం వల్ల ఆక్సిజన్ సరఫరా తగ్గి చాల సమస్యలు మొదలవుతాయి. ఈ హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ చాల అవసరం. అందువల్ల రక్త హీనత సమస్య తగ్గాలంటే ఐరన్ లోపాన్ని అధిగమించాలి.
లక్షణాలు:
- చర్మం పాలిపోవడం, అలసట, గుండె కొట్టుకునే రేటు పెరగడం గాని, తగ్గడం గాని జరుగుతుంది.
- రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల ఎంత గట్టిగ శ్వాస తీసుకున్న సరిపోనట్లు అనిపిస్తుంది.
- పెదవులు, చిగుళ్లు, కనురెప్పల లోపల ఎరుపుదనం తగ్గడం.
- గోళ్లు విరిగిపోవడం, పాలిపోవడం.
- జుట్టు రాలిపోవడం, కండరాలు పట్టేయడం.
- తలనొప్పి, ఆందోళన, టెన్షన్, అలజడిగా ఉండటం.
రక్త హీనత సమస్యని అధిగమించడానికి తీసుకోవాల్సిన ఆహారపదార్థాలు:
- పాలకూర, సోయాబీన్, గుడ్లు, చేపలు, ఆకుకూర, బంగాళాదుంప వంటివి.
- నువ్వులు, బెల్లం కలిపి తినాలి.
- డ్రై ఫ్రూప్ట్స్– ఎండిన అల్బుకర, ఆప్రికాట్స్, అంజీర్, ఖర్జూరం, ద్రాక్ష వంటివి రాత్రి నానబెట్టి పొద్దున్న పరిగడుపున తినాలి.
- నానబెట్టిన బాదాం తినాలి.
- దానిమ్మ రసం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
- వీరి రెగ్యులర్ డైట్ లో మునగాకును చేర్చుకోవాలి.