తెలుగు వారందరూ అమితంగా ఇష్టపడే కూర వంకాయ. ఇది రుచి లోనే కాదు ఆరోగ్యానికి చేసే మేలు, అందించే ప్రయోజనాలు తెలిస్తే కూడా “ఆహా” అంటారు. వంకాయను “కింగ్ అఫ్ వెజిటబుల్స్” గ అభివర్ణిస్తారు. అంత రుచి గల వంకాయ అందించే ఆరోగ్య ప్రయోజనాలు తక్కువేమి కాదు. వంకాయ కలిగి ఉండే పోషకాలు, ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే మరింత ఇష్టంగా తింటారు.
పోషకాలు: వంకాయలో విటమిన్ B1, B2, B6, C, K ఉంటాయి. వీటిలో ఇంకా పాస్పరస్, క్యాల్షియం, పొటాషియం, జింక్, మెగ్నీషియం, ఐరన్ ఉంటాయి.
ప్రయోజనాలు :
- వంకాయలను తరుచు తినడం వల్ల వీటిలో ఉండే ఆంథోసనియన్స్ గుండె ఆరోగ్యానికి మేలుచేస్తాయి, గుండెపోటు రాకుండా నివారిస్తాయని పరిశోధనలు తెలుపుతున్నాయి.
- కొలస్ట్రాల్ తగ్గిస్తుంది. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.
- వంకాయలో ఉండే నాసునిన్ అనే సమ్మేళనం మెదడుకి రక్త సరఫరాను పెంచుతుంది. దీని వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
- కాన్సర్ నుండి రక్షించే గుణాలు ఉంటాయి.
- వంకాయ గింజలు తింటే జీర్ణ వ్యవస్థ, మూత్రాశయ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది.
- బరువు తగ్గించడంలో వంకాయలు మంచి రెమెడీగ చెప్పవచ్చు.
గమనిక:
వాత రోగంతో బాధపడుతున్న వారు వంకాయ తినకపోవడం మంచిది