అనేక ఔషధ గుణాలకు నిలయం బిళ్ళ గన్నేరు

July 14, 2019

బిళ్ళగన్నేరును సంస్కృతంలో నిత్య కళ్యాణి, నిత్యా పుష్పి అంటారు. అనేక ఔషధ గుణాలు ఉన్న ఈ మొక్కకి వేల సంవత్సరాలనుండి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ మొక్క యొక్క పూలు తెలుపు, గులాబీ రంగులో ఉంటాయి. ఈ మొక్క 365 రోజులు సంవత్సరమంతా పూలు పూస్తుంది. బిళ్ళ గన్నేరు పూలు, ఆకులు దగ్గర నుండి వేరు వరకు అన్ని ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ మొక్క యాంటీ డయాబెటిక్, యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగిఉంటుంది.

ప్రయోజనాలు:

  1. ఈ మొక్క ఆకుల రసాన్ని పరగడుపున 1స్పూన్ చొప్పున తీసుకుంటూ ఉంటె బీపీ ని కంట్రోల్ లో ఉంచుతుంది.
  2. చెడు కొలస్ట్రాల్ ని హరిస్తుంది. రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది.
  3. ఈ మొక్క వేరుని ఎండబెట్టి పొడిచేసి రోజు 1/2స్పూన్ చొప్పున గోరువెచ్చటి నీటిలో కలిపి పరగడుపున రోజు తీసుకుంటూ ఉంటే- షుగర్ తగ్గుముఖం పడుతుంది.
  4. వీటి పువ్వుల్ని 7-10 తీసుకుని కాషాయం ల తయారుచేసి తీసుకుంటుంటే డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి తగ్గిస్తుంది.
  5. ఈ కాషాయం తీసుకోవడం వళ్ళ రుతు సంబంధ సమస్యలు తగ్గుతాయి. అధిక రుతుస్రావం సమస్యకి మంచి మెడిసిన్.
  6. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు కాన్సర్ కారకాలను సమర్థవంతంగా ఎదుర్కుంటాయి. లంగ్ కాన్సర్ వైద్యంలో మంచి ఫలితాలనిస్తుంది అని పరిశోధనల్లో తేలింది.
  7. గాయాలపైన, పుల్లపైన వీటి ఆకుల పేస్ట్ ని లేపనంలా(రోజుకి 2-3 సార్లు) రాయడం వల్ల త్వరగా మానిపోతాయి.
  8. నోటి అల్సర్స్ , చిగుళ్ల సమస్యలకు ఈ ఆకుల కషాయంతో పుక్కిటపట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  9. వీటి ఆకుల పొడితో వేప ఆకుల పొడి ఇంకా పసుపు తో కలిపి పేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
  10. ఆయాసాన్ని తగ్గిస్తుంది. మొలల సమస్యకు మంచి మెడిసిన్.

గమనిక:

  1. గర్భిణీ స్త్రీలు, బాలింతలు దీనిని తీసుకోకూడదు.
  2. పైన చెప్పిన వాటిలో ఏ రకంగా దీనిని వాడిన కూడా 45 రోజులు వాడిన తరువాత మల్లి 45 రోజులు విరామం ఇచ్చి తిరిగి వాడటం మొదలుపెట్టాలి. సంవత్సరానికి 3-4 టైమ్స్ వాడవచ్చు.