మనం సాదారణంగా ఆధ్యాత్మిక విషయాలలో అంటే పూజలు, యాగాలు వంటి వాటిలో కర్పూరం ని వాడుతుంటారు. కానీ కర్పూరం ను మన నిత్య జీవితంలో ఎదుర్కొనే చిన్నచిన్నసమస్యలకు నివారణగా వాడవచ్చు.
- నీటిలో కర్పూరం బిళ్లలను వేసి మంచం కింద ఉంచితే దోమలు రాకుండా ఉంటాయి.
- మన ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉండేలా చేస్తుంది.
- అంటువ్యాధులు రాకుండా చూస్తుంది.
- చుండ్రు సమస్య ఉన్నవాళ్ళు కొబ్బరి నూనెలో కర్పూరం వేసి గంట తర్వాత దానిని జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్య మాయమవుతుంది. పేల సమస్య కూడా దూరం అవుతుంది.
- వానాకాలంలో ఈగల సమస్య ఎక్కువగా ఉంటుంది. అర బకెట్ నీళ్ళలో ఒక గుప్పెడు వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చేవరకు మరిగించి ఆ నీటితో నేలను తుడిస్తే ఈగలు రాకుండా ఉంటాయి.