సునాముఖి – చాల రకాల మొండి వ్యాధులకు సరైన పరిస్కారం

August 5, 2019

సునాముఖి దీనినే స్వర్ణ పత్రి, నేల తంగేడు అని కూడా అంటారు. ఈ సునాముఖి ఆకులూ, కాయలు అనేక ఔషధ గుణాలు కలిగి ఆయుర్వేద వైద్యంలో వాడబడుతుంది. చాల రకాల మొండి వ్యాధులకు ఈ చూర్ణం ని ఔషదంగా సేవిస్తారు. ఆయుర్వేద పరిజ్ఞానం కల వారందరికీ సునాముఖి సుపరిచితమే. ఎందుకంటే ఈ సునాముఖి కలిగి ఉండే ఆయుర్వేద గుణాలు అలాంటివి.

ప్రయోజనాలు:

  1. గ్యాస్ట్రబుల్ – రోజు 2 పూటలా ఉదయం, రాత్రి భోజనానికి ముందు 3 గ్రాముల సునాముఖి చూర్ణం ను పటిక బెల్లం పొడి తో కలిపి చల్లటి నీటితో చేర్చి తాగుతూ ఉంటే గ్యాస్ట్రబుల్ సమస్య తగ్గిపోతుంది.
  2. శరీర పుష్టికి – పడుకునే ముందు 3 గ్రాముల సునాముఖి చూర్ణం నీటితో కలిపి తేనె చేర్చి ఒక సంవత్సరం తాగుతూ ఉంటే ఏనుగుతో సమానమైన బలం చేకూరుతుంది.
  3. రక్తశుద్ధికి – 1/2 కప్పు పాలలో 1 స్పూన్ సునాముఖి చూర్ణం కలిపి సేవిస్తే రక్తశుద్ధి కలుగుతుంది.
  4. ఉబ్బసం – 3 గ్రాముల సునాముఖి చూర్ణం 1 కప్పు దానిమ్మ రసం తో చేర్చి తాగడం వల్ల ఉబ్బసం తగ్గుతుంది, ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది.
  5. మలబద్దకం – 1 గ్లాస్ నీటిలో 1 స్పూన్ సునాముఖి చూర్ణం కలిపి రాత్రి పడుకునేముందు తాగితే మలబద్దకం నివారించబడుతుంది. లేదా 100 గ్రాముల బెల్లం, 50 గ్రాముల సునాముఖి చూర్ణం కలిపి దంచి 5 గ్రాముల చొప్పున గోలీలలాగా తయారుచేసుకోవాలి, రోజుకో మాత్ర రాత్రి పడుకునే ముందు తీసుకుంటుంటే మలబద్దకం తగ్గిపోతుంది.
  6. ఒంటి నొప్పులకు – 5 గ్రాముల సునాముఖి చూర్ణం ను 1 స్పూన్ ఆవునెయ్యితో కలిపి ఉదయం, రాత్రి 2 పూటల భోజనానికి ముందు తీసుకుంటుంటే ఈ సమస్య తగ్గుతుంది.
  7. కిడ్నీలలో రాళ్లు కరగాలంటే – కూర దోస రసం లో 3 గ్రాముల సునాముఖి చూర్ణం కలిపి రోజుకి 2 పూటలా తాగాలి.
  8. అధిక చెమట సమస్య – 1/2 కప్పు మజ్జిగలో 3-6 గ్రాముల సునాముఖి చూర్ణం కలిపి రోజుకి 2 పూటలా తీసుకుంటుంటే అధిక చెమట సమస్య తగ్గుతుంది.