అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో

August 13, 2019

అవకాడో పండు మద్యమెక్సికొ ప్రాంతానికి చెందింది. దీనిని వెన్న పండు అని కూడా అంటారు. ఇది అందరికి ఎక్కువగా తెలియదు కానీ మెండుగా ఆరోగ్య ప్రయోజనాలందించే పండు. ఇది రుచికి కొంచం చేదుగా ఉంటుంది. కొంచం వెన్న రుచిని కలిగి ఉంటుంది. అన్ని సూపర్ మార్కెట్ లలో లభిస్తుంది.

అవకాడో లోని పోషకాలు: వీటిలో విటమిన్ A, B, B6, E ఉంటాయి. ఈ పండులో అధికంగా కాలరీలు, ఫైబర్, ఫోలిక్ ఆసిడ్, హెల్దీ ఫాట్, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు కలిగి ఉంటాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ని కలిగి ఉంటుంది. యాంటీ ఇంఫలమేటరీ గుణాలని కలిగి ఉంటుంది.

అవకాడో వలన ప్రయోజనాలు:

  1. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.
  2. గుండె సమస్యలను అరికడుతుంది.
  3. చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
  4. జాయింట్ పెయిన్స్ ఉన్నచోట అవకాడో ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
  5. పొటిషియం లెవెల్స్ ని పెంచుతుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
  6. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  7. అవకాడో గుజ్జులో తేనె, పాలు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
  8. అవకాడో ఆయిల్ ని ముఖానికి మసాజ్ చేయడం వల్ల ముఖం పై ముడతలు, మచ్చలు తగ్గిపోతాయి.
  9. కొలస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది.
  10. ఒత్తిడిని, టెన్షన్ ని తగ్గిస్తుంది.