అంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్

August 22, 2019

apple cider vinegar side effects cures and uses in telugu

  1. గోరువెచ్చని నీటిలో 1స్పూన్ వెనిగర్ వేసి పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన తగ్గి నోరు తాజాగా ఉంటుంది.
  2. ఉదయం పరగడుపున 1 కప్పు నీటిలో 1 టీ స్పూన్ వెనిగర్ వేసి తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ని క్రమబద్దీకరిస్తుంది.
  3. భోజనానికి 1 గంట ముందు 1 గ్లాస్ నీటిలో 2 స్పూన్ల వెనిగర్ వేసి 2 పూటలా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.
  4. 1 కప్పు చల్లటి నీటిలో 1 టీ స్పూన్ వెనిగర్ వేసి పరగడుపున తీసుకోవడం వల్ల రక్తపోటుని తగ్గిస్తుంది.
  5. గొంతు ఇన్ఫెక్షన్ లను తగ్గిస్తుంది. జలుబు, దగ్గు సమస్యలకి మంచి పరిష్కారం.
  6. చెడు కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది, శరీరంలో టాక్సిన్స్ ని బయటకి పంపిస్తుంది.
  7. తలస్నానం చేసిన తరువాత జుట్టుకి కండిషనర్ అప్లై చేసిన తరువాత ఒక మగ్గు నీటిలో 1/2 కప్పు వెనిగర్ వేసి కలిపి జుట్టు పూర్తిగా తడిసేలా వేయాలి, 2 నిమిషాల తరువాత మాములు నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సిల్కీ గా స్మూత్ గా తయారవుతుంది.
  8. స్నానం చేసే నీటిలో 4 లేదా 5 చుక్కల వెనిగర్ ని కలపి స్నానం చేయడం వల్ల చర్మం PH లెవెల్స్ ని బాలన్స్ చేసి కాంతివంతంగా చేస్తుంది.
  9. 1/2 బకెట్ నీటిలో 1 కప్పు వెనిగర్ వేసి పాదాలను ఆ నీటిలో ఉంచి 20 నిమిషాల తరువాత రబ్ చేయడం వల్ల పాదాలు మృదువుగా తయారవుతాయి. పాదాలకు ఏదయినా ఫంగస్ ఉన్న తొలగిపోతుంది.
  10. అలోవెరా జెల్ లో 2 లేదా 3 చుక్కల వెనిగర్ వేసి మసాజ్ చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

గమనిక :- అధికంగా తీసుకుంటే పళ్ళపై ఉండే ఎనామిల్ ను నష్టపరిచే ప్రమాదం ఉంది.