నువ్వులను సంస్కృతంలో “తిల” అంటారు. నువ్వులు ఉండే పోషకాలు మరెటువంటి దినుసులలో ఉండవు. క్యాల్షియం మన శరీరానికి ఎంత అవసరమో మన అందరికి తెలుసు. అందుకే క్రమంతప్పకుండా పిల్లలకు పాలు తాగిస్తూ ఉంటాము. అయితే ఒక గ్లాసు పాలతో పోల్చితే 250 రెట్లు అధికంగా క్యాల్షియం నువ్వులలో ఉంటుంది. దీని ద్వారా చెప్పవచ్చు నువ్వులు ఎంత గొప్ప పౌష్టికాహారం అని. ఈ ప్రకృతి మొత్తం లో క్యాల్షియం అధికంగా అందించేది నువ్వులు మాత్రమే. అందుకే అందరు తప్పకుండ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సిందే.
పోషకాలు: నువ్వులలో విటమిన్స్ తో పాటు ప్రోటీన్స్, కాపర్, క్యాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, ఫైబర్, మెగా ఫ్యాటీ ఆమ్లాలు, ఫోలిక్ ఆసిడ్ కూడా ఉంటాయి . నువ్వులు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలను కలిగి ఉంటుంది.
నువ్వుల వలన కలిగే ప్రయోజనాలు:
- చర్మాన్ని U.V కిరణాలనుండి కాపాడుతుంది. నువ్వుల నూనె చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
- నువ్వులు రక్తంలో ఉండే షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. రక్త హీనతకి నువ్వుల లడ్డు మంచి మెడిసిన్.
- ఎముకలు, దంతాల సమస్యలకి చెక్ పెట్టవచ్చు.
- అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. కాన్సర్ రాకుండా నివారిస్తుంది.
- పురుషుల్లో వీర్య వృద్ధికి బాగా ఉపకరిస్తుంది.
- బహిష్టు సమయంలో నొప్పిని తగ్గిస్తుంది.
- చేడు కొలస్ట్రాల్ ని తగ్గించి, మంచి కొలస్ట్రాల్ ని పెంచుతుంది.
- కాళ్ళ పగుళ్ళకి మంచి రెమెడీ.
- కంటిచూపుని మెరుగుపరుస్తుంది.
- జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. గోరువెచ్చని నువ్వులనూనెతో మర్దన చేయడం వళ్ళ జుట్టు రాలటం, చిట్లడం, చుండ్రు, తగ్గి కుదుళ్ళని దృడంగా చేస్తుంది.