ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణం (Rock Salt)

May 14, 2019

సైంధవ లవణం (Rock Salt) : సింధు నది తీరంలో లభిస్తుంది కనుక దీనిని సైంధవ లవణం అంటారు. మహర్షులు దీనిని లవణోత్తమ అని సంబోధిస్తారు. ఎందుకంటే భారతదేశంలో లభించే 5 రకాల లవనాలలో దీనిని ఉత్తమమైనదిగా చెప్తారు. ఇది ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.కనుక ఆయుర్వేదంలో అనేక రుగ్మతలకు ఔషధంగా సైంధవ లవణాన్ని వాడుతారు. ఇది సహజసిద్ధంగానే అయోడిన్ ను కలిగి ఉంటుంది. సాధారణ ఉప్పు పైత్యాన్ని పెంచుతుంది. కానీ సైంధవ లవణం పైత్యాన్ని హరిస్తుంది.

సైంధవ లవణం వలన కలిగే ప్రయోజనాలు :-

  1. వాత, పిత్త మరియు కఫాలను హరిస్తుంది.
  2. ఉబ్బసం రోగులకు మంచి మందుగా ఉపకరిస్తుంది.
  3. జీర్ణ శక్తిని పెంచుతుంది. ఎక్కిళ్ళ సమస్యను నివారిస్తుంది.
  4. గుండె ఆరోగ్యానికి మంచి మందుగా పని చేస్తుంది.
  5. కీళ్ల నొప్పులను నివారిస్తుంది.
  6. కడుపులో పురుగులను నశింపచేస్తుంది.
  7. నోటి దుర్వాసన, పంటి నొప్పి, టాన్సిల్స్, గొంతు నొప్పిని తగిస్తుంది.
  8. ఉభయకాయన్ని నివారిస్తుంది.
  9. నరాల బలహీనత, కండరాల నొప్పులను తగ్గిస్తుంది.
  10. మలబద్దకానికి మంచి మెడిసిన్ గా చెప్పవచ్చు.

ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్నందు వల్లనే పూర్వకాలంలో లాగానే సముద్ర లవణానికి బదులుగా సైంధవ లవణాన్ని వాడుతున్నారు.ఇది చాల రుగ్మతలకు మంచి మెడిసిన్.