అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లం

May 29, 2019

ఈమధ్య కాలంలో ఎక్కువ జనాదరణలోకి వచ్చిన పూర్వకాలపు ఆహారపదార్థం తాటి బెల్లం. దీనిలోని ఔషధగుణాలే ఇది ప్రాచుర్యంలోకి రావడానికి గల ముఖ్యకారణం. దీనిని తమిళనాడులో ఎక్కువగా తయారు చేస్తారు

తాటి బెల్లం తయారీ:

తాటిచెట్టు నుండి వచ్చిన తాటి నీరా నుండి తాటి బెల్లం తయారు చేస్తారు.తాటి నీరా అనేది మత్తును కలిగించని, ఆరోగ్యాన్నిచ్చే ఒక పానీయం. తాటి నీరాను బాగా వేడి చేసి తాటి బెల్లం ను తయారుచేస్తారు. ఇందులో ఎలాంటి రంగు, ఇతర పదార్థాలు కలుపరు. ఇది రుచికి పూర్తిగా బెల్లం లాగే ఉంటుంది. కానీ చెరుకు బెల్లంలో గ్లూకోజ్ ఉంటుంది, తాటి బెల్లం లో సుక్రోజ్ ఉంటుంది.

తాటి బెల్లం లోని పోషకాలు :

ఐరన్, కాల్షియమ్, మెగ్నీషియం, పొటాషియం , పాస్పరస్, మాంగనీస్ కార్బోహైడ్రేట్స్ మరియు సుక్రోజ్ ఉంటాయి. తాటి బెల్లం లో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి.

ఇందులో తేమ – 8.61%,
ఖనిజ లవణాలు – 3.15%,
సుక్రోజ్ – 76.86%,
కాల్షియం – 0.86%,
మాంసకృత్తులు – 1.04% .

తాటి బెల్లం వలన ప్రయోజనాలు:

  1. తాటి బెల్లం లో ఉండే పొటాషియం కొవ్వును కరిగించడంలో, అధిక బరువును తగ్గించడంలో మరియు బీపీ ని కంట్రోల్ చేయడంలో ఉపకరిస్తుంది.
  2. గోరు వెచ్చని నీటిలో తాటి బెల్లం కలుపుకొని తాగడం వలన జలుబు, దగ్గు నివారింపబడుతుంది.
  3. దీనిని రోజు తీసుకోవడం వలన శరీర పుష్టి మరియు వీర్య వృద్ధి కలుగును
  4. శరీరంలో హానికర టాక్సిన్స్ ను బయటకి పంపిస్తుంది. మలబద్దకం సమస్యను నివారిస్తుంది.
  5. లివర్ కి స్నేహకారిగా ఉంటుంది. లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  6. అనీమియా(రక్తహీనత)సమస్యను నివారిస్తుంది.రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.స్త్రీలలో బహిష్టు సమస్యలను అరికడుతుంది.
  7. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు బ్లడ్ ప్యూరిఫై చేసి శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరిస్తుంది.
  8. జీర్ణాశయ ఎంజైమ్ ల పనితీరుని మెరుగుపరుస్తుంది.
  9. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో వేడిని తొలగిస్తుంది.
  10. చిన్న ప్రేగులు,పెద్దప్రేగులలో ఉండే విషపదార్థాలను బయటికి పంపించి, ప్రేగు కాన్సర్ రాకుండా చేస్తుంది.

గమనిక:-
షుగర్ కంట్రోల్ ఉండే షుగర్ వ్యాధిగ్రస్తులు దీనిని తక్కువ మోతాదులో తీసుకోవచ్చు.
దీనిని రోజు 25-30 గ్రాముల వరకు తీసుకోవచ్చు.